వీడియో : కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందులో వాడే మూలికలు ఇవే..!
krishnapatnam anandayya ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఎక్కడ చూసినా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు గురించే చర్చ. మీడియాలోనూ అవే కథనాలు. ప్రపంచానికే సవాల్ విసిరిన కరోనా మహమ్మారికి పసరు వైద్యంతో చెక్ పెట్టాడు ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య. అసలు.. ఏంటి ఆ పసరు వైద్యం.. ఆ మందులో అంత పవర్ ఉందా? కరోనాను చంపే శక్తి ఉందా? ఇంతకీ ఆ కరోనా మందును ఆయన ఎలా తయారు చేస్తున్నారు. దాంట్లో వాడే వనమూలికలు ఏంటి? ఆ మందు తింటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? పత్యం చేయాలా? ఇలా చాలామందికి కరోనా ఆయుర్వేద మందు గురించి…
ముందుగా కరోనా మందులో ఎటువంటి వన మూలికలను వాడుతారో తెలుసుకుందాం. అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి చెట్టు, కొండ పల్లేరు కాయల చెట్టు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకుల చెట్టు, తెల్లజిల్లేడు పూల మొగ్గలు, ముళ్ల వంకాయలు.. ఇవే ఆ మందు తయారీలో వాడేవి. ఇందులో మనకు తెలియనివి ఏవీ లేవు. వీటిలో దాదాపు అన్నింటినీ మనం రోజూ వారి ఆహారంలో వాడుతూనే ఉంటాం. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే.
ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందులో వాడేవి krishnapatnam anandayya
అల్లం.. శరీరానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అల్లు.. శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. అందుకే.. మనం ప్రతి రోజూ కూరల్లో అల్లాన్ని వేసుకొని తింటాం.
ఇక.. తాటి బెల్లం దివ్యౌషధం. తాటిబెల్లాన్ని ప్రతి ఆయుర్వేద మందులో వాడుతుంటారు. ఆయుర్వేద మందులు కొంచెం చేదుగా, ఘాటుగా ఉంటాయి. చేదుగా ఉన్నవాటిని మింగడానికి ప్రజలు ఇష్టూపడరు కాబట్టి.. కాసింత తాటిబెల్లాన్ని ఆ మిశ్రమంలో కలుపుతారు. దీంతో రుచి తియ్యగా అవుతుంది. తాటి బెల్లం.. వల్ల ఏ ఔషధం గుణ ధర్మం కూడా చెడిపోదు. అందుకే.. ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో తాటి బెల్లాన్ని వాడుతుంటారు.ఇక తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. తేనె కఫాన్ని తగ్గిస్తుంది. అందుకే.. తేనెను ఈ మందు తయారీలో వాడుతున్నారు.నల్లజీలకర్ర శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. అలాగే.. నల్లజీలకర్రను వాడితే అలసట తగ్గుతుంది. బలహీనతకు కూడా చెక్ పెట్టొచ్చు.అలాగే తోకమిరియాలు, లవంగాలు యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. కీళ్ల నొప్పులను తగ్గించే గుణం లవంగాలలో ఉంటే.. జలుబు, దగ్గు, కండరాల నొప్పి నివారణకు తోక మిరియాలను వాడుతుంటారు.
ఇక.. అసలు సిసలైన వేప ఆకుల గురించి చెప్పాలంటే.. వేప శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, శిలీంద్రాలు, ఫంగస్ లను తరిమికొట్టే శక్తి వేప సొంతం. అందుకే.. రోజూ ఉదయాన్నే వేప పుల్ల వేసుకొని పళ్లు తోముకుంటాం. దగ్గు ఉన్నా.. కఫం, అస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలను చెక్ పెట్టడానికి వేప ఆకు ఎంతో ఉపయోగపడుతుంది.నేరేడు చెట్టు మొత్తం ఔషధాల గని. నేరేడు పండ్లు, నేరేడు చిగుర్లు.. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నేరేడులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కాలేయాన్ని క్లీన్ చేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ సోకినా.. బ్యాక్టీరియాను నాశనం చేయాలన్నా.. నేరేడు చిగుర్లు మంచి ఔషధం.
మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండ పల్లేరు, కుప్పింటాకు, తెల్ల జిల్లేడు పువ్వు, పట్టా, బుడ్డబుడస ఆకు, ముళ్ల వంకాయ.. ఇవన్నీ ఆయాసాన్ని, వైరల్ ఫీవర్ ను, గొంతునొప్పి, దగ్గు, జలుబును తగ్గించడానికి.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.వీటన్నింటితో కలిపి చేసిన మిశ్రమం కరోనాను బ్రహ్మాండంగా మంచి ఔషధంలా తయారై.. కరోనాను తరిమికొట్టడంలో సూపర్ గా పనిచేస్తోందని ఆనందయ్యతో పాటు.. ఈ మందును వాడిన వేలాది మంది ప్రజలు కూడా చెబుతున్నారు. అలాగే.. ఈ మిశ్రమాన్ని వాడటం వల్ల.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని చెబుతుండటంతో ప్రజల్లో ఈ మందు మీదద నమ్మకం ఇంకాస్త పెరిగిందని చెప్పుకోవాలి.మామిడి చిగుర్లలోనూ అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. కడుపులో ఉన్న నులి పురుగులకు తొలగించడం కోసం, హై ఫీవర్ ను తగ్గించడం కోసం, కాలేయ సమస్యలకు చెక్ పెట్టడం కోసం మామిడి చిగుర్లను వాడుతుంటారు.
అలాగే నేల ఉసిరి కూడా మంచి ఔషధ మొక్క. ఇది వైరల్ ఫీవర్ ను తగ్గించేందుకు మంచి మందులా పనిచేస్తుంది. అలాగే.. మూత్ర సంబంధమైన వ్యాధులను తగ్గించడానికి.. ఉదర సంబంధమైన సమస్యలను తగ్గించడానికి కూడా నేల ఉసిరి బాగా వాడుతారు. ఇంకా పలు రకాల వైరస్ ను తగ్గించే శక్తి నేల ఉసిరికి ఉంటుంది. krishnapatnam anandayya కొండ పల్లేరు ఆకు కూడా దివ్యౌషధం. అది ఆయాసాన్ని, ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. కొండ పల్లేరు ఆకు వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. క్షయ వ్యాధిగ్రస్తులకు కూడా దీంతోనే ట్రీట్ మెంట్ చేస్తుంటారు. కుప్పింటాకును రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి నివారణకు ఇది దివ్యౌషధం. కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా ఈ మొక్కను వాడుతారు. తెల్లజిల్లేడు పువ్వును ఎక్కువగా పాముకాటుకు విరుగుడుగా వాడుతుంటారు. తెల్లజిల్లేడు శరీరంలోని విషాన్ని గ్రహిస్తుంది. అస్తమా రోగులకు ఇది దివ్యౌషధం. బుడ్డబుడస ఆకు దీన్నే గాజు తీగ.. బంగారు తీగ లేదా తెల్ల జుమికి అని కూడా పిలుస్తారు. ఇవి అనేక మొండి వ్యాధులను నయం చేస్తాయి. krishnapatnam anandayya జీర్ణ వ్యవస్థ పటిష్ఠం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముళ్ల వంకాయలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ ఎన్నో రకాల సమస్యలను నివారిస్తాయి.