Nikhil Kamath : మోదీని చూసి మనం చాలా నేర్చుకోవాలి.. ప్రశంసల జల్లు కురిపించిన నిఖిల్ కామత్
ప్రధానాంశాలు:
Nikhil Kamath : మోదీని చూసి మనం చాలా నేర్చుకోవాలి.. ప్రశంసల జల్లు కురిపించిన నిఖిల్ కామత్
Nikhil Kamath : ఇండియాని అత్యున్నతంగా రూపొందించే పనిలో ఉన్నారు నరేంద్ర మోది. మరోసారి ఎన్నికలలో గెలిచి భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీ అనేక ప్రణాళికలు రచిస్తూ అందరి దృష్టి భారత్‌పై పడేలా చేస్తున్నారు . ఈ క్రమంలో మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్‌గా రణ్‌బీర్ కపూర్, ప్రముఖ పారిశ్రామికవేత్త, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ మధ్య జరిగిన పోడ్ కాస్ట్ లో మోదీ కృషి, ఆయన పనితీరుపై నిఖిల్ కామత్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీతో కలిగిన ఓ అనుభవం గురించి మాట్లాడిన నిఖిల్ కామత్.. ఆయన నుండి ఎంతో నేర్చుకోవాలని అన్నారు.
Nikhil Kamath మోదీపై ప్రశంసలు..
సంవత్సరం క్రితం ముగ్గురితో కూడిన బృందం వాషింగ్టన్‌లో ఉన్నప్పుడు ఆయనని చూసి ఆశ్చర్యపోయాం. ఉదయం 8 గంటలకు అమెరికన్ వ్యాపారవేత్తలతో బిజినెస్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం 11 గంటలకు వేరే చోట ప్రసంగం ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ఉపరాష్ట్రపతితో డిబెట్ జరిపారు. ఇక సాయంత్రం 4 గంటలకు వేరే మీటింగ్, రాత్రి 7 గంటలకు మరొకటి, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఇంకొకటి అదే క్రమంలో రాత్రి 11 గంటలకి కూడా ఓ సమావేశంలో పాల్గొన్నారు. అలా వరుస సమావేశాలలో పాల్గొన్నా కూడా ఆయన అంతే ఉత్సాహంగా ఉన్నారు. రెండు రోజులకి తాను అలసిపోయిన ఆయన మాత్రం యాక్టివ్‌గా ఉన్నారంటూ నిఖిల్ కామత్ తెలియజేశారు.
ఇక రణ్‌బీర్ కపూర్ కూడా మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల క్రితం నటీనటులు, దర్శకులు అందరం కలిసి ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లాం. అప్పటిదాకా ఆయన్ని టెలివిజన్‌లో మాత్రమే చూశాం. ఆయనొక గొప్ప వక్త. ప్రధాని మోదీలో ఆకర్షించే శక్తి ఉంది. ప్రతి వ్యక్తి దగ్గరకు ఆయన వచ్చి యోగ క్షేమాలు, కుటుంబ ఆరోగ్య పరిస్థితులు కనుక్కునే వారు. మా నాన్న ట్రీట్‌మెంట్ ఆ సమయంలో జరుగుతుండగా, దాని గురించి ఆరా తీసారు. అలియాతో, విక్కీ కౌశల్‌తో, కరణ్ జోహార్‌తో ఒక్కొక్కరితో ఒక్కో విషయం గురించి మాట్లాడారు. ప్రతిదీ చాలా పర్సనల్’ అని పేర్కొన్నాడు. ఉన్నత వ్యక్తులకే ఇలాంటి గొప్ప గుణాలు ఉంటాయి అని రణ్‌బీర్ చెప్పాడు.