Ys Jagan : పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2019 శాసన సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 13 చోట్ల నెగ్గింది. రెండు (ఏలూరు, నర్సాపురం) ఎంపీ సీట్లను కూడా కైవసం చేసుకుంది. 2014లో కూడా ఆ జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇదే స్థాయిలో ఘన విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం సెగ్మెంట్లను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమే సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రజలకు పెద్దగా మేలు చేయలేదని చెప్పొచ్చు. వాళ్లు నిజంగా జనానికి మంచి చేసుంటే 2019లో 15 మందికి 15 మంది ఎందుకు ఓడిపోతారు?. ఆ సంగతి ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం ఈ జిల్లాలోని వైఎస్సార్సీపీ శాసన సభ్యుల్లో చాలా మంది 30 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగినవారే అయినప్పటికీ ఆ స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే అభిప్రాయం నెలకొంది.
ఈ జిల్లా నుంచి ముగ్గురు శాసన సభ్యులు మంత్రులుగా ఉన్నారు. వాళ్లు.. ఆళ్ల నాని, తానేటి వనిత, రంగనాథరాజు. మినిస్టర్లుగా వీళ్లు కొద్దో గొప్పో ప్రభావం చూపుతున్నారు. అందువల్ల ఈ ముగ్గుర్ని పక్కన పెడితే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు పేరుకే ఎమ్మెల్యేలుగా మిగిలిపోతున్నారని పబ్లిక్ అంటున్నారు.ఈ పది మంది ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేదని వీరిపై జగన్ సీరియస్‌గా ఉన్నట్లు పార్టీ లో తెగ చర్చ జరుగుతుంది. వాళ్లకు పార్టీ హైకమాండ్ వద్ద పలుకుబడి విషయంలో గానీ ప్రజలకు అవసరమైన పనులు చేయించటంలో గానీ ఫస్ట్ క్లాస్ మార్కులు పడట్లేదని చెబుతున్నారు. అఫ్ కోర్స్ వాళ్లు గెలిచిన ఈ రెండేళ్లలో రెండు సార్లు కరోనా వ్యాప్తి వల్ల బయట చురుకుగా వ్యవహరించి ఉండకపోవచ్చు. కానీ వచ్చే మూడేళ్లైనా యాక్టివ్ గా ఉంటే తప్ప మరోసారి ప్రజల ఆశీస్సులు పొందలేరని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, నరసాపురం శాసన సభ్యుడు ముదునూరు ప్రసాదరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ప్రజాజీవితంలో రెండు మూడు దశాబ్దాల నుంచి ఉంటున్నారు. అయినా చెప్పుకోదగ్గ స్థాయిలో పనులు చేయట్లేదనే టాక్ వినిపిస్తోంది. వీళ్లు పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లి నిధుల విషయంలో ఒత్తిడి చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ హైకమాండ్ సైతం తమ ప్రాధాన్యతను గుర్తించట్లేదని వీళ్లు తమలో తామే మథనపడుతున్నారు. మంత్రి పదవులు కాకపోయినా ఇతరత్రా పోస్టులేవైనా ఇస్తే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. వీళ్ల అభిప్రాయాలను, ఆవేదనను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పటికి ఆలకిస్తారో చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.