Omicron virus : బీ కేర్ ఫుల్.. ఒమిక్రాన్ వేరియంట్ వారికే ఎక్కువ సోకే ప్రమాదం..!
Omicron virus : కరోనా మహమ్మారి ప్రభావం ఇక అయిపోయింది అనుకునే లోపే మళ్లీ కొత్త వేరియంట్ రూపంలో వస్తున్నది. ఈ క్రమంలోనే భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా అప్రమత్తమవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించక మునుపే తగు చర్యలు తీసుకుంటున్నాయి. మళ్లీ నైట్ కర్ఫ్యూలు విధించడంతో పాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ చేస్తున్నాయి. కాగా, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని ఒమిక్రాన్ వేరియంట్ అటాక్ చేసే చాన్సెస్ ఉన్నాయని కొందరు అంటున్నారు. ఇంతకీ ఇ మ్యూనటీ పవర్ తక్కువగా ఉందని తెలుసుకోవడం ఎలాగంటే.. మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా కరోనా నిబంధనలు పాటించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికే కరోనా మహమ్మారి ఎక్కువగా సోకుతున్నది. ఈ లక్షణాల ఆధారంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందన్న సంగతి మనం గ్రహించొచ్చు. తరచూ దగ్గు, జలుబు సమస్యలు వస్తే కనుక వారిలో ఇమ్యూనటీ పవర్ తక్కువగా ఉన్నట్లేనన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ పుష్కలంగా ఉన్న వారికి అస్సలు దగ్గు, జలుబు రావు.
Omicron virus : కరోనా జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు..
ఇకపోతే బ్లడ్ సర్కులేషన్ ఇష్యూస్ ఉన్నా లేదా, రక్త నాళాలలో వాపులు ఉన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ లేనట్లే. స్కిన్ యెల్లో కలర్‌లోకి లేదా బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అయినా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లే అన్న సంగతి గ్రహించాలి. ఇమ్యూనిటీ పవర్ లేనట్లయితే డైజేషన్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. మలబద్ధకం, విరేచనాలు, కడుపు నొప్పి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్నా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని గ్రహించాలి. కాబట్టి.. ఈ లక్షణాల ఆధారంగా ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి.