Immunity Power : రోక నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన పూర్వీకులు చెప్పిన రహస్యాలు ఇవే…!
ప్రధానాంశాలు:
Immunity Power : రోక నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన పూర్వీకులు చెప్పిన రహస్యాలు ఇవే...!
Immunity Power : ప్రపంచ దేశాలని వనికించిన మహమ్మారి. మనదేశంలో మాత్రం అంతగా ప్రభావం చూపించలేక పోవడానికి మీరు గమనించారా..? అది మన దేశ వేద విజ్ఞానం యొక్క గొప్పతనం. బయట నుండి మన శరీరంలోకి ప్రవేశించే ఎలాంటి వైరస్ అయినా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థతో పోరాడి గెలిచిన తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశించగలదు.. మిగతా దేశాలతో పోలిస్తే మన భారతీయుల్లో రోగ నిరోధక శక్తి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీనికి మన ఆహార విధానమే కారణమని చెప్పవచ్చు. మన పూర్వీకులు మన శరీరం రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కావలసిన ఆహారమైన వెల్లుల్లి, పసుపు, మిరియాలు, అల్లం, ఉల్లి వంటి వాటిని మన జీవన విధానంలోనే అలవాటు చేశారు.
దీని వలన మిగతా దేశాల వారితో పోలిస్తే మన భారతీయుల్లో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇవే కాకుండా నిత్యం దొరికే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మనలోని ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకొని ఎటువంటి వైరస్లు మన శరీరంపై దాడి చేయకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం.. క్యారెట్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. నిత్యం తినడం వలన దీంట్లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్ లు ఉత్తేజపరుస్తాయి. తరచూ పాలకూర తినడం వలన దీనిలో విటమిన్ సి పోలిక్ ఆసిడ్ ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో తోడ్పడతాయి.
అలానే పుచ్చకాయల తరచూ తినడం వలన దీనిలో పుష్కలంగా ఉండే బ్లూటూత్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. వెల్లుల్లి మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ తలెత్తకుండా చూస్తుంది. రోజు ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలను తింటూ ఉంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, వీటితోపాటు క్యాబేజీ, చిలకలకడ దుంప, బాదం, మొలకలు, విటమిన్ సి ఎక్కువగా లభించే నిమ్మ జాతి పండ్లను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే రోజు మూడు లీటర్ల నీళ్లను తాగడంతో పాటు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇవి గనుక పాటిస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది..