Sugar Cane Juice : చెరుకు రసం తాగితే ఎన్నో వ్యాధులు మటాష్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sugar Cane Juice : చెరుకు రసం తాగితే ఎన్నో వ్యాధులు మటాష్…!

 Authored By aruna | The Telugu News | Updated on :23 January 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Sugar Cane Juice : చెరుకు రసం తాగితే ఎన్నో వ్యాధులు మటాష్...!

Sugar Cane Juice  : కల్తీ కాని పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటి. అయితే కల్తీ అవ్వని పానీయం చెరకు రసం.పల్లెలలో మొదలైన ఈ చేరకు రసం వినియోగం.. పలవాసులు పట్టణాలలో ప్రజలకు వీటిని పరిచయం చేశారు. ఈ రసంలో కొంచెం అల్లం, నిమ్మరసం కలుపుకొని తాగితే రక్తహీనతను దూరం చేస్తుంది. అలసట వలన వచ్చే ఆయాసాన్ని దూరం చేస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉంచుతాయి. ఈ రసంలో ఉండే చక్కెరని శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. శరీరం డిహైడ్రేషన్ కి లోనైనప్పుడు చెరుకు రసం తాగితే తక్షణ శక్తి వచ్చి త్వరగా కోలుకుంటారు.

మధుమేహం ఉన్నవారు కూడా చేరకు రసం తాగొచ్చు. దంత సమస్యలను కూడా నివారిస్తుంది. శరీరంలోకి క్యాన్సర్ రాకుండా నియంత్రించే ప్లవనాడ్స్ లో ఉంటాయి. ఈ ఆంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు విస్తరించకుండా చేయడంతో పాటు వాటితో పోరాడి నాశనం చేస్తాయి. కాలేయ వ్యాధులు కామెర్ల నుంచి కాలయానికి రక్షణ ఇస్తుంది.
చెరుకు రసం శరీరం నుండి టాక్సిన్స్ ఇన్ఫెక్షన్స్ తొలగించడంలో సహాయపడే అద్భుతమైన మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. చెరుకు రసం తాగడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు కిడ్నీలో రాళ్లు రాకుండా ఉంటాయి. ఇది కిడ్నీల సరైన పనితీరుకు దోహదపడుతుంది.

మన శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరిస్తోంది. జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. దప్పికను నివారించి వెంటనే శక్తినిస్తుంది. రక్తహీనతలు తగ్గిస్తుంది. క్యాన్సర్లను నివారిస్తుంది. స్త్రీలలో వచ్చే గర్భాదారణ సమస్యలను తొలగిస్తుంది. మూత్ర సంబంధత ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది.. చెరుకు తినడం కంటే దాని జ్యూస్ తాగడం వల్ల ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది