Phone Fraud : 90 ఏళ్ల మహిళ నుంచి 241 కోట్లు కొట్టేశారు.. ప్రపంచంలో ఇది అతి పెద్ద మోసం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Phone Fraud : 90 ఏళ్ల మహిళ నుంచి 241 కోట్లు కొట్టేశారు.. ప్రపంచంలో ఇది అతి పెద్ద మోసం..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 April 2021,9:54 pm

Phone : ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా 241 కోట్లు… 90 ఏళ్ల మహిళ నుంచి కొట్టేశారు. వాళ్లు ఎవరో తెలుసా? సైబర్ నేరగాళ్లు. కానీ… తమ పనిని కేవలం ఒక ఫోన్ తో కానిచ్చేశారు. ఆ మహిళ నుంచి పెద్ద మొత్తంలో గుంజి… ప్రపంచంలోనే అతి పెద్ద మోసానికి తెర లేపారు. 241 కోట్లంటే మామూలు మాటలా? వృద్ధ మహిళను టార్గెట్ చేసుకున్న సైబర్ క్రిమినల్స్… తమ పనిని చాలా సులభంగా చేసేశారు. ఇంతకీ ఆ మహిళ వీళ్ల బుట్టలో ఎలా పడింది… వీళ్లు అంత ఈజీగా తనను ఎలా మోసం చేయగలిగారో తెలుసుకుందాం రండి.

ఆ వృద్ధ మహిళ వయసు సుమారు 90 ఏళ్లు. హాంగ్ కాంగ్ లో మిలియనీర్. గత సంవత్సరం వేసవి కాలంలో ఆ మహిళకు కొందరు వ్యక్తులు ఫోన్ చేశారు. తాము చైనా పబ్లిక్ సెక్యూరిటీ అధికారులం అని తమను తాము పరిచయం చేసుకున్నారు. ఒక క్రిమినల్ కేసులో ఆ మహిళ ఇరుక్కుందని అబద్ధం చెప్పారు. తన ఐడెంటిటీని కొందరు వాడుకొని ఈ నేరం చేశారని… అందుకే తనకు కాల్ చేశామని నమ్మబలికారు. ఆ మహిళ కూడా నిజమే అనుకుంది. తన అకౌంట్ లో నుంచి కొంత డబ్బు తమకు పంపించాలంటూ వాళ్లు డిమాండ్ చేశారు. తమ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు డబ్బు పంపిస్తే తాము అకౌంట్ వివరాలు చెక్ చేస్తామని చెప్పారు. దీంతో ఆ మహిళ నమ్మి.. కొంత డబ్బును వాళ్లు చెప్పిన అకౌంట్ లోకి పంపించింది.

old woman lost 241 crore in phone

old woman lost 241 crore in phone

కొన్ని రోజుల తర్వాత ఓ వ్యక్తి తన ఇంటికి వచ్చి.. ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డు ఇచ్చి… సెక్యూరిటీ అధికారులతో మాట్లాడేందుకు ఈ ఫోన్ నే వాడాలంటూ చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కేటుగాళ్లు ఆ ఫోన్ ద్వారా తనను బెదరిస్తూ సుమారు 11 సార్లు తనతో డబ్బు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అలా ఐదు నెలల్లో తన నుంచి సుమారు 241 కోట్ల రూపాయలు లాగారు.

Phone : తన ఇంట్లో పనిచేసే వ్యక్తిని అనుమానం రావడంతో బయటపడ్డ మోసం

అయితే.. ఆ వృద్ధ మహిళ ఇంట్లో పనిచేసే వ్యక్తికి అనుమానం వచ్చింది. వృద్ధ మహిళ ఆందోళనగా ఉండటం.. రోజూ ఎవరితోనే టెన్షన్ గా ఫోన్ లో మాట్లాడటం గమనించి… వెంటేనే ఆ మహిళ కూతురుకు ఆ విషయాన్ని చెప్పింది. దీంతో ఆ మహిళ కూతురు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు… విచారణ ప్రారంభించారు. ఆ మహిళ డబ్బులు పంపించిన బ్యాంకు అకౌంట్ డిటెయిల్స్ తెలుసుకొని… ఈ ఫ్రాడ్ వెనుక ఉన్న 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. అసలు విషయం తెలుసుకున్న ఆ మహిళ బావురుమంది. అంతే కదా.. ఒకటా రెండా… 241 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదా.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది