Jamili Elections : మళ్లీ తెరపైకి ‘జమిలి ఎన్నికలు’.. ఈ సారైనా స్పష్టత వచ్చేనా?
Jamili Elections : దేశంలోని 29 రాష్ట్రాల్లో అనేక సార్లు ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలు కూడా జరుగుతుంటాయి. కాగా, ఇలా ఐదేళ్ల కాలంలో ఇన్ని రకాల ఎన్నికలు జరుగుతుంటే ప్రజాధనం అనవసరంగా వృథా అవుతుందనే భావనలోంచి పుట్టుకొచ్చిందే ‘జమిలి ఎన్నికలు’. అనగా లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరగడం..అలా అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే.. ప్రజాధనం వృథా కాదని, అంతా సవ్యమైన స్థితిలో ఉంటుందనే వాదనను ‘జమిలి ఎన్నికల’ ద్వారా తెరమీదకు తీసుకొచ్చారు. గతంలోనూ ఈ అంశంపైన చర్చ జరిగింది. కానీ, ఆచరణలో ఎటూ తేలలేదు.
Jamili Elections : రాజకీయ పార్టీలన్నీ మద్దతిచ్చేనా?
ప్రజాస్వామ్య భారతంలో ప్రజాస్వామ్య పరిఢవిల్లాలంటే ఇటువంటి ఆలోచనలకు అందరూ మద్దతు పలకాలని, ‘జమిలి ఎన్నికల’ కోసం చట్టాలు తీసుకొచ్చి నిబంధనలు మార్చుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలా దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడం సాధ్యమేనా? సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. నూట ముప్పై కోట్ల మంది ఉన్న సువిశాల భారతదేశంలో భౌగోళిక పరిస్థితులు ఒకేసారి ఎన్నికలకు అనుమతించగలవా? అసలు దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా? అనేది తేలాల్సి ఉంది. ఈ జమిలి ఎన్నికల ఆలోచననలు మోడీ ప్రభుత్వం గతంలోనూ చేసింది. కానీ, దానిపైన సమగ్రమైన చర్చ జరగలేదు.
ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నందు వల్లే ‘జమిలి ఎన్నికల’ ప్రతిపాదనను మోడీ సర్కారు ముందకు తీసుకొస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ చట్టాల రద్దు జరిగిందని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో ‘జమిలి ఎన్నికల’పై అభిప్రాయ సేకరణ చేయనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. టీడీపీ కూడా ఓకే చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు. అయితే, ‘జమిలి ఎన్నికల’ వలన జాతీయ పార్టీలకే లాభముంటుందని, ప్రాంతీయ పార్టీలకు లాభం ఉండబోదనే అభిప్రాయాలూ ఉన్నాయి. చూడాలి మరి.. ఏమవుతుందో..