సీమ రాజకీయం.. కేతిరెడ్డిని దెబ్బేసేందుకు పరిటాల తీవ్ర ప్రయత్నాలు
kethireddy venkatarami reddy : రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ రాజకీయం వేరు అన్నట్లుగా ఉంటుంది. అక్కడ ఇంతకు ముందు మాదిరిగా కొట్టుకోవడం నరుక్కోవడం లేదు. కాని ఆ రేంజ్ లోనే రాజకీయాలు జరుగుతాయి అనడంలో సందేహం లేదు. రాయలసీమ లో పరిటాల రవి తర్వాత ఆ రేంజ్ నాయకుడు మళ్లీ ఎదగలేదు అంటూ ఆయన అభిమానులు అనుకుంటూ ఉంటారు. మళ్లీ అంతటి స్థాయిని ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. పరిటాల రవి చనిపోయిన తర్వాత నియోజక వర్గంలో ప్రాభవంను కాపాడుకుంటూ పరిటాల సునీత వచ్చారు.
ఇప్పుడు ఆమె తనయుడు పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరామ్ అక్కడ సత్తా చాటేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనకు రాప్తాడు మరియు ధర్మవరం నియోజక వర్గాల బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కు అప్పగించిన విషయం తెల్సిందే.చంద్రబాబు నాయుడు ఆ బాధ్యతలు కట్టబెట్టినప్పటి నుండి కూడా పరిటాల శ్రీరామ్ రెండు నియోజక వర్గాల్లో తనదైన ముద్రను వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతను పరిటాల శ్రీరామ్ నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు అనడంలో కూడా సందేహం లేదు.
kethireddy venkatarami reddy : కేతిరెడ్డిపై పైచేయి సాధించేందుకు…
రాప్తాడు విషయం పక్కన పెడితే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సందడి ఎక్కువ అయ్యింది. అక్కడ వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజల్లోకి దూసుకు పోతు సొంత ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ సోషల్ మీడియాలో మంచి పేరును దక్కించుకున్నాడు. న్యూట్రల్ గా ఉన్న వారిని మాత్రమే కాకుండా తెలుగు దేశం పార్టీలో ఉన్న కింది స్థాయి వారిని కూడా ఆకర్షించే విధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటున్నాడు.కేతిరెడ్డిని దెబ్బ తీసేందుకు పరిటాల శ్రీరామ్ విమర్శల మీద విమర్శలు చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేస్తున్న యాత్ర మొత్తం బూటకం అంటున్నారు.
ఆయన అధికారులను హడావుడి చేసినంత మాత్రాన అక్కడ పనులు ఏమీ జరగడం లేదని పరిటాల శ్రీరామ్ ఆరోపిస్తున్నాడు. ఇటీవల ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పర్యటించిన సమయంలో గొడవ జరిగింది. వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు కవ్వింపు చర్యలు చేశారు. దాంతో తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా గొడవకు దిగారు. ఈ గొడవకు కారణం అంటూ పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు అయ్యింది. మొత్తానికి ధర్మవరంలో కేతిరెడ్డిపై పైచేయి సాధించేందుకు పరిటాల శ్రీరామ్ పడుతున్న కష్టం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది.