Comedian Mahesh : జనసేన పార్టీ ఎమ్మెల్యేగా కమెడియన్ మహేష్ .. క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..!!
Comedian Mahesh : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ లలో ఒకరు మహేష్. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఈ షో కి ఉన్న క్రేజ్ అంతా కాదు. ఈ షో ద్వారా చాలామంది సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ తమ పేరును పాపులర్ చేసుకుంటున్నారు. కొంతమంది కమెడియన్స్ గా ప్రేక్షకులను అలరిస్తుంటే మరికొందరు హీరోలుగా ప్రయత్నాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షో ద్వారా సినిమాల్లో బాగా బిజీ అయిన అతి కొద్ది మందిలో ఒకరు మహేష్.
ఇక రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో నటించడంతో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అలాంటి మహేష్ తన పొలిటికల్ ఎంట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గనుక తనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు రెడీగా ఉన్నాను అని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. పవన్ కళ్యాణ్ ది చాలా గొప్ప వ్యక్తిత్వం అని, ఆయనతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు సినిమా సెట్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏది తింటారో అదే అందరికీ పెట్టించే వారిని చెప్పారు. తనది తూర్పుగోదావరిలోని శంకరగుప్తం అని, అక్కడ పవన్ కళ్యాణ్ ను అందరూ చాలా ప్రేమిస్తారని చెప్పుకొచ్చాడు.
జనసేన పార్టీ కోసం స్థానికంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారని ఆయన తెలిపారు. దేవుడి దయ వలన పార్టీ తరపున పోటీ పడే ఛాన్స్ వస్తే కచ్చితంగా నిలబడతానన్నారు. ఇప్పుడు మాత్రం తన ఆసక్తి అంత సినిమాల మీదే ఉంది అని అన్నారు. మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహేష్ వ్యాఖ్యలకు స్పందిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కు అభిమానుల్లో విపరీతమైన క్రేసి ఉంది. కేవలం సినిమాల పరంగా కాకుండా పార్టీ పరంగా కూడా ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.