Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతోంది.!
Pawan Kalyan : తెలంగాణలో అసలంటూ జనసేన పార్టీకి క్రియాశీలకమైన నాయకులు ఎవరన్నా వున్నారా.? లేదా.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. నిజానికి, తెలంగాణలో పెద్దగా జనసేన సందడి లేదు. అయితే, పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులుగా మారి.. కింది స్థాయిలో చాలా యాక్టివ్ అయ్యారు. జనసేన పార్టీకి తక్కువ శాతంలో అయినా స్థిరమైన ఓటు బ్యాంకు వుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పరిస్థితి రోజురోజుకీ బెటర్ అవుతోంది.
అధికారంలోకి వచ్చే స్థాయిలో కాకపోయినా, ఖచ్చితంగా రెండు ప్రధాన రాజకీయ పార్టీల విజయావకాశాల్ని దెబ్బతీసే స్థాయిలో జనసేన పార్టీ బలపడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర సత్ఫలితాన్నిస్తోంది. జనసేన – జనవాణి కార్యక్రమం కూడా జనంలోకి బాగానే చొచ్చుకు వెళ్ళింది.అయితే, జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎటువైపు నిలబడుతుంది.? అన్నదానిపై మళ్ళీ భిన్నరకాలైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వైసీపీ వైపు అయితే జనసేన నిలబడదు. టీడీపీకి మద్దతిస్తుందా.? లేదా.? అన్నదానిపై సందేహాలున్నాయి. బీజేపీతో జనసేన ప్రస్తుతానికి పొత్తు పెట్టుకుందిగానీ, అది అలాగే కొనసాగుతుందా.? అంటే, అది మళ్ళీ సస్పెన్స్.
ఇలా జనసేన రాజకీయం ఎవరికీ ఏమాత్రం అర్థం కావడంలేదు. కానీ, జనసేన ఖచ్చితంగా రెండు ప్రధాన రాజకీయ పార్టీల విజయావకాశాల్ని దెబ్బ తీస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ జనసేన పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వొచ్చనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే, తెలంగాణలో త్రిముఖ పోటీ వుండబోతోంది గనుక.అందుకే, జనసేన పార్టీని తెలంగాణలోనూ కలుపుకుపోవాలని బీజేపీ అనుకుంటోంటే, జనసేన ఓటు తమకు బదలాయింపు కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి కోరుకుంటోందిట. ఏపీలో అయితే, వైసీపీ ఒకింత జనసేన ఓటు బ్యాంకు మీద ప్రత్యేకమైన కన్నేసినట్లు తెలుస్తోంది.