PM Modi : తుపానులా విరుచుకుపడ్డ కరోనాకు లాక్ డౌనే చివరి అస్త్రం… లాక్ డౌన్ పై ప్రధాని మోదీ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Modi : తుపానులా విరుచుకుపడ్డ కరోనాకు లాక్ డౌనే చివరి అస్త్రం… లాక్ డౌన్ పై ప్రధాని మోదీ?

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 April 2021,6:00 am

PM Modi : ప్రస్తుతం కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. చాప కింద నీరులా దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ దూసుకొచ్చింది. దీంతో కరోనా కేసులు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా… దేశమంతా ఎక్కడ చూసినా ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. బెడ్స్ లేవు… వెంటిలేటర్లు లేవు.. ఆక్సీజన్ సిలిండర్లు లేవు. కరోనా మరణాల రేటు కూడా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఆక్సీజన్ దొరకక… చాలామంది మృత్యువాత పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి.. దేశమంతటా.. ఎక్కడా ఆక్సీజన్ సిలిండర్ల కొరత రావద్దని.. అన్ని చోట్లకు ఆక్సీజన్ సిలిండర్లను… రోడ్డు, రైల్వే మార్గం ద్వారా పంపిస్తున్నారు.

pm narendra modi addresses nation on corona second wave

pm narendra modi addresses nation on corona second wave

అయితే… ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులతో దేశ ప్రజలంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో… ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి తాజాగా ప్రసంగించారు. కరోనా సెకండ్ వేవ్ దూసుకొస్తోందని… తుపానులా విరుచుకుపడుతోందని.. దాని నుంచి మనం బయటపడాలంటే… లాక్ డౌన్ విధించడమే చివరి అస్త్రం అని మోదీ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు కూడా చివరి అస్త్రంగానే లాక్ డౌన్ ను ఉపయోగించాలని మోదీ సూచించారు.

చాలా రాష్ట్రాల్లో ఆక్సీజన్ కొరత ఉంది. ప్రతి ఒక్క కరోనా పేషెంట్ కు ఆక్సీజన్ అందేలా చర్యలు తీసుకున్నాం. మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా… అందరం జాగ్రత్తగా ఉందాం. కరోనా సంక్షోభం నుంచి బయటపడదాం. కరోనా సెకండ్ వేవ్ మనందరికీ సవాల్ విసురుతోంది. కాబట్టి.. అందరూ జాగ్రత్త పడాలి. ఎటువంటి పరిస్థితినైనా సరే… ఎదుర్కునేందుకు రెడీగా ఉండాలి.. అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

PM Modi : ప్రపంచంలోనే అత్యంత చౌకైన వ్యాక్సిన్ ను మనం తయారు చేసుకున్నాం

మన దేశంలోనే ఎక్కడా లేనంత చౌకగా వ్యాక్సిన్ లభిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నాం. రోజూ లక్షల మంది ఉచిత వ్యాక్సిన్ ను వేసుకుంటున్నారు. వలస కార్మికులు కూడా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి. వారికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. వలస కార్మికులను చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అవసరమైతేనే ప్రజలంతా ఇంట్లోనుంచి బయటికి వెళ్లండి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశాం. ఇప్పటి వరకు 45 సంవత్సరాలు పైబడిన వాళ్లకే వ్యాక్సిన్ ఇస్తున్నాం. మే 1 నుంచి మాత్రం 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ను ఇస్తాం.. అని ప్రధాని మోదీ తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది