Narendra Modi : ప్రపంచ దేశాలు.. భారత్ వైపు చూస్తున్నాయి.. ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగం..!!
Narendra Modi : 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ మరోసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రస్తుతం మనం నెంబర్ వన్ గా ఉన్నాం. ఇంత విశాల దేశం..లో 140 కోట్ల మంది జనాభా నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్రం వచ్చింది. వారందరికీ నా ధన్యవాదాలు. ఎన్నో సమస్యలు ఉన్నాగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉన్న సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం. మణిపూర్ ఇంకా మరి కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది.
కొంతమంది జీవితాలు చిన్న భిన్నమయ్యాయి. త్వరలోనే మణిపూర్ లో శాంతి నెలకొంటది. మణిపూర్ ప్రజల వెంట దేశం ఉంది. కేంద్రం అక్కడే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి శాంతిని నెలకొల్పుతాం. భారతదేశం ఏ రంగాలలో ముందుకు పోతుంది. మన దేశానికి అమృతకాలం ప్రారంభమైంది. ఇది మొదటి సంవత్సరం వచ్చే వెయ్యలపాడు దేశానికి స్వర్ణయోగం ఉంటుంది. యువతతో భారత్ జోరుగా ఉంది. విశ్వంలో భారత్ పట్ల సరికొత్త ఆకర్షణ విశ్వాసం ఆశ కలుగుతున్నాయి. దేశంలో యువ శక్తిపై నాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ ప్రపంచంలో స్టార్టప్ లలో భారత్ మూడో స్థానంలో ఉంది. టెక్నాలజీ పరంగా కూడా భారత్ సరికొత్త భూమిక పోషిస్తుంది. క్రీడలలో యువ సత్తా చాటుతూ ఉంది. చిన్న గ్రామాల నుంచి వచ్చిన వారు సైతం శాటిలైట్లు తయారు చేస్తున్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతిభ చాటుతున్నారు. దేశం ముందుకు వెళ్లడానికి అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనం జి20 సదస్సును నిర్వహించుకుంటున్నాం. భారత్ లో వైవిధ్యాన్ని ప్రపంచం చూస్తుంది. కారణం భారత్ పట్ల ఆకర్షణ పెరిగింది. భారతీయుల సమర్థతను ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. కరోనా తర్వాత పెద్దపెద్ద ఆర్థిక వ్యవస్థలో పతనం అవుతున్నాయి కానీ మనం మాత్రం దృఢంగా ఉన్నాం ప్రపంచానికి కేంద్రం అవుతున్నాము. మనం విశ్వ కళ్యాణం దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రపంచ ఎకనామికి భారత్ అవసరం ఏర్పడనుంది. ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పార్వతిపురం ఐదవ స్థానంలో నిలిచింది. యువశక్తి కోసం ప్రత్యేక శాఖను తీసుకొస్తాం. జల శక్తి ద్వారా దేశ ప్రజలకు మంచినీరు అందిస్తున్నాం.
కరోనా తర్వాత ఆయుష్ శాఖను తీసుకువచ్చి.. ఆరోగ్యం పెంచుతున్నాం. మత్స్య పాలన ఇంక పశుపాలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. వన్ రాంక్ వన్ పెన్షన్ ద్వారా సైనికులకు మేలు చేశాం. అన్ని వర్గాల వారికి మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నాం. 5g తీసుకొచ్చాం ఇప్పుడు 6g కూడా తీసుకురాబోతున్నాం. ప్రపంచంలో మహిళా పైలెట్లు ఎక్కువగా ఉన్న దేశం భారత్. 2047లో భారత్ వందేళ్ళ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. అప్పటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అటువంటి సామర్థ్యం దేశానికి ఉంది. ఇదేవిధంగా దేశంలో అవినీతిని అంతమందించాలి. 2047 లక్ష్యంగా దేశం లో అభివృద్ధి జరగాలంటే వచ్చే ఐదేళ్లు కీలకం విశ్వంతో ముందుకు సాగుదాం జై హింద్ అని ప్రధాని మోదీ ప్రసంగించారు.