Khammam : ఇల్లెందులో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే
Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. ఇల్లెందులో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇల్లెందులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాంబాబు… ప్రస్తుతం కొత్తగూడెంలో తన విధులను నిర్వర్తిస్తున్నాడు.

police constable commits suicide in yellandu khammam
అయితే.. గత కొన్ని రోజుల నుంచి ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి. తన భార్య కూడా అతడిపై వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆయన తీవ్రంగా మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం నుంచి డ్యూటీకి వెళ్లకుండా.. ఇంట్లోనే ఉంటూ తనను వేధిస్తున్నాడని కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో తీవ్ర మనస్థాపం చెందిన రాంబాబు.. ఇల్లెందులోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి వెళ్లి.. కేసును దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.