Police : పోలీసులు సూపర్.. కేవలం 15 నిమిషాల్లోనే.. ఒక నీండు ప్రాణాన్ని కాపాడారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Police : పోలీసులు సూపర్.. కేవలం 15 నిమిషాల్లోనే.. ఒక నీండు ప్రాణాన్ని కాపాడారు

 Authored By praveen | The Telugu News | Updated on :4 January 2022,5:40 pm

Police : సిటీలో గ్రీన్ ఛానల్ నిర్వహించడం మనం చూస్తేనే ఉంటాం. దీని కోసం పోలీసులు, అధికారులు, డాక్టర్లు తీసుకునే రిస్క్ అంతా ఇంతా కాదు. చనిపోయిన వారి అవయవాలతో వేరొక వ్యక్తి ప్రాణాలను నిలిపేందుకు వారు చేసే కృషి మామూలుగా ఉండదు. ఈ విషయంలో సిటీ పోలీసులు మరోసారి సూపర్ అనిపించుకున్నారు.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఆర్గాన్స్‌ను తరలించేందుకు గ్రీన్ ఛానల్ నిర్వహించారు పోలీసులు. దీని కోసం ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.బ్రెయిన్ డెడ్ అయిన సదురు వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ రెండు ఆస్పత్రుల మధ్య దూరం 17.6 కిలోమీటర్లు కాగా

police moved the organs in 15 minutes

police moved the organs in 15 minutes

Police : 15 నిమిషాల్లోనే..

పోలీసులు కేవలం 15 నిమిషాల్లో అవయవాలను తరలించారు. చనిపోయిన వ్యక్తి అవయవాలతో మరొకరి ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది