Police : కొంప ముంచిన డ్వాక్రా లెక్కలు.. తనపై తానే కేసు పెట్టుకున్న పోలీస్ ఆఫీసర్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Police : కొంప ముంచిన డ్వాక్రా లెక్కలు.. తనపై తానే కేసు పెట్టుకున్న పోలీస్ ఆఫీసర్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :20 June 2023,7:00 pm

Police : సాధారణంగా దొంగలపై అదేవిధంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. సమాజంలో ఇది సర్వసాధారణం. కానీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వింత సంఘటన చోటు చేసుకుంది. డ్వాక్రా లెక్కలలో చోటు చేసుకున్న తప్పులు కారణంగా కోర్టు ఆదేశాలతో తనతో పాటు 14 మందిపై ఓ పోలీస్ అధికారి కేసు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి విషయంలోకి వెళ్తే యూపీలో మహారాజ్ గంజ్ లోని కోల్హుయి పోలీస్ స్టేషన్ పరిధిలో బడహార శివనాథ్ గ్రామంలో సూర్య ప్రకాష్ చౌదరి నివాసమంటున్నాడు. అతని భార్య సీమ డ్వాక్రా గ్రూప్ నందు సభ్యురాలిగా ఉంది. డ్వాక్రా గ్రూప్ అధ్యక్షురాలు షీలా దేవి. అయితే ఈ షీలాదేవి భర్త గ్రామ సర్పంచ్ గా విధులు వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో షీలా దేవి.. 15000 డబ్బులు కాజేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రూపు సభ్యురాలు సిమా డ్వాక్రా డబ్బుల లెక్కలు చూపించాలని నిలదీయడం జరిగింది. దీంతో షీలా దేవి.. భర్త గ్రామ సర్పంచ్ మోహిత్ యాదవ్.. తన అనుచరులతో సిమా ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు చంపుతామని బెదిరించడం జరిగింది. దాడి జరిగిన వెంటనే సీమ భర్త సూర్యప్రకాష్ పోలీస్ స్టేషన్ లో షీలా దేవి.. ఆమె భర్త గ్రామ సర్పంచ్ మోహిత్ లపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు ఫిర్యాదును తీసుకోలేదు. అంతేకాకుండా సీమ భర్తను పోలీస్ స్టేషన్ నుంచి తరిమేశారు. పోలీసుల తీరుకు ఆగ్రహించి కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. కోర్టు విచారించి కోల్హుయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ తో సహా గ్రామ సర్పంచ్ మోహిత్, భార్య షీలా దేవి మరో 14 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

police who filed a case against himself

police who filed a case against himself

కోర్టు ఆదేశాలు అనుసరించి తనతో పాటు మరో 14 మందిపై పోలీస్ సెక్షన్ల కింద పోలీసు అధికారి కేసు నమోదు చేశారు. డ్వాక్రా డబ్బులు కాజేసిన ఘటనతో పాటు డ్వాక్రా సభ్యురాలు ఇంటిపై దాడికి పాల్పడటంతో అనేక సెక్షన్ల క్రింద షీలా దేవి ఆమె భర్త గ్రామ సర్పంచ్ లాపై భారీగా కేసులు నమోదు కావడంతో ఊరి వారంతా కోర్టు నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు సూర్యప్రకాష్ నీ అభినందించారు.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది