Post Office Scheme : ఈ పథకంలో చేరారంటే… 40 లక్షలు రిటర్న్స్ పొందవచ్చు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Post Office Scheme : ఈ పథకంలో చేరారంటే… 40 లక్షలు రిటర్న్స్ పొందవచ్చు…!

Post Office Scheme ; ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఆర్థికంగా ఎంతోకొంత వెనక వేసుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొందరు పిల్లల కోసం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో పెట్టుబడును పెడుతుంటారు. ఇప్పటికే పిల్లల కోసం పోస్టాఫీస్, బ్యాంకులు, పాలసీ కంపెనీలు చాలా పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. వాటిలో ఎక్కువమంది ఆసక్తి చూపించేది పొదుపు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 October 2022,5:30 pm

Post Office Scheme ; ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఆర్థికంగా ఎంతోకొంత వెనక వేసుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొందరు పిల్లల కోసం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో పెట్టుబడును పెడుతుంటారు. ఇప్పటికే పిల్లల కోసం పోస్టాఫీస్, బ్యాంకులు, పాలసీ కంపెనీలు చాలా పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. వాటిలో ఎక్కువమంది ఆసక్తి చూపించేది పొదుపు పథకాలకే. ఎందుకంటే వడ్డీ తక్కువైనా గాని రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలో పిపిఎఫ్ ఒకటి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో నెల నెల కొంత పెట్టుబడి చొప్పున 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ టైం కి 60 లక్షలు పొందవచ్చు. ఆ డబ్బు పిల్లలపై చదువులకు బాగా ఉపయోగపడుతుంది. దీని మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత 40 లక్షలు రావాలంటే నెలకి 12,500 చొప్పున ఏడాదికి లక్షన్నర పెట్టుబడి పెడుతూ వెళ్ళాలి. అలా పదిహేనేళ్లలో పెట్టుబడి పెడితే 22 లక్షల 50 వేలు అవుతాయి. దానికి ప్రస్తుతం వడ్డీ రేటు ప్రకారం 7.1 శాతం వడ్డీ కలిపి 15 ఏళ్ల తర్వాత 18 లక్షల పైన వస్తాయి. ఈ లెక్కన మొత్తం 40 లక్షల పైన వస్తుంది. పెట్టుబడి 22 లక్షల అయితే వడ్డీ దాదాపు 20 లక్షల అదనంగా వస్తుంది.

Post office scheme get 40 lakhs

Post office scheme get 40 lakhs

ఇదే పథకాన్ని ఎక్కువ ఐదేళ్లు పొడిగిస్తే 66 లక్షలకు పైగా డబ్బు వస్తుంది. మరో ఐదు ఏళ్ళు పొడిగిస్తే కోటి మూడు లక్షల వస్తాయి. పాతికేళ్ల పాటు నెలకు రూ.12,500 చొప్పున పెట్టుబడి 37 లక్షల 50 వేలు అయితే దానికి వడ్డీగా 73 లక్షల అదనంగా వస్తాయి. పిల్లలు పెద్దయ్యేసరికి ఆ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఇంతకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. పొదుపు చేసే పెట్టుబడి మీద ఆదాయం ఆధారపడి ఉంటుంది. బ్యాంకుల్లోను, పోస్టాఫీస్ లోను ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలిగేది ఈ పథకం ద్వారానే. సామాన్య ప్రజలు తమ పిల్లల కోసం కష్టమైన కొంత డబ్బుని ఇప్పటినుంచి పొదుపు చేస్తూ ఉంటే వారు ఎదిగే సమయానికి రెట్టింపు వస్తుంది. అది వారి చదువులకు ఉపయోగపడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది