Prabhas | ప్రీ లుక్ పోస్టర్‌తో పిచ్చెక్కించారు.. రేపు ఫస్ట్ లుక్ పోస్టర్
ప్రీ లుక్ పోస్టర్‌తో పిచ్చెక్కించారు.. రేపు ఫస్ట్ లుక్ పోస్టర్పాన్-ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడిక్ వార్ & రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మేకర్స్ వరుసగా అప్డేట్స్ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతాయా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
#image_title
ఫ్యాన్స్ వెయిటింగ్..
తాజాగా మేకర్స్ టైటిల్ టీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. “అతడే ఒక సైన్యం” అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ పోస్టర్‌లో “1932 నుంచి ది మోస్ట్ వాంటెడ్” అనే ట్యాగ్‌లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ప్రభాస్ ఈ సినిమాలో ఏ రకమైన పాత్రలో కనిపించబోతున్నాడా అనే ఆసక్తి మరింత పెరిగింది.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, అక్టోబర్ 23 ఉదయం 11.07 గంటలకు ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ భరద్వాజ్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హను మాట్లాడుతూ, “‘ఫౌజీ’ కథ నా మనసులో చాలా కాలంగా ఉంది. ఇది నేను ప్రత్యేకంగా ప్రభాస్ కోసం రాసిన స్క్రిప్ట్. సీతారామం తరువాత ఈ సినిమాపై రెండు సంవత్సరాలుగా శ్రమిస్తున్నాను. ఆర్మీ నేపథ్యంలో నేను రాసిన ఆరు కథల్లో ఇది ప్రత్యేకం. ఆడియన్స్ ఎలాంటి అంచనాలతో వచ్చినా, వాటిని మించేదిగా ఉంటుంది” అంటూ పేర్కొన్నారు.