Realme C35: సరికొత్త ఫీచర్స్‌తో రియల్ మీ ఫోన్.. ఎప్పుడు విడుదల కానుందో తెలుసా?
Realme C35 : రియల్ మీ నుండి సరికొత్త ఫీచర్స్‌తో అనేక రకాల మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. భారత మార్కెట్‌లోకి మరో బడ్జెట్ మొబైల్ రానుంది. రియల్‌మీ సీ35 మొబైల్‌ను లాంచ్ చేసేందుకు చైనీస్ మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ సిద్ధమైంది. మార్చి 7వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ మొబైల్‌ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.. 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన వెనుక మూడు కెమెరాల సెటప్, ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో రియల్‌మీ సీ35 రానుంది.ఈ మొబైల్ 50MP ప్రధాన సెన్సార్‌తో కూడిన మూడు కెమెరాల సెటప్, మాక్రో సెన్సార్, ప్రొట్రయిట్‌గా మిగిలిన రెండు కెమెరాలు ఉంటాయి.
ఫుల్ హెచ్‌డీ+డిస్‌ప్లే, ఆక్టోకోర్ ప్రాసెస్‌తో రానుంది. ఈ మొబైల్ గతంలో థాయ్‌లాండ్‌లో విడుదలైంది. అక్కడ ప్రారంభ ధర 5,799 థాయ్ బాట్స్ (సుమారు రూ.13,350)గా ఉంది. అయితే భారత్‌లో రూ.10వేల లోపు ఉండే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోన్ 6.6 అంగుళాల సైజు, 600 నిట్స్ పిక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఇక ఈ మొబైల్‌లో బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పొడిగించుకోవాలంటే సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఫీచర్ ఈ మొబైల్‌లో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
Realme C35 : రియల్ మీ అదరగొడుతుందిగా..
గత నెలలోనే ఈ ఫోన్‌ను థాయిలాండ్‌లో లాంచ్ చేశారు. 6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 90.7 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 600 నిట్స్ బ్రైట్‌నెస్, సూపర్ పవర్ సేవింగ్ మోడ్, 18 వాట్స్ క్విక్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ ధర రూ.13,350గా ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్, ఆక్టాకోర్ యూనిఎస్‌వోసీ టీ616 ఎస్‌వోసీ ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ గరిష్ఠంగా 128జీబీ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. థాయ్‌లాండ్‌లో లాంచ్ అయిన స్పెసిఫికేషన్లతో రియల్‌మీ సీ35 భారత్‌లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో ఈ మొబైల్ రానుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఇక ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత పొడిగించుకునేందుకు ఉపయోగపడేలా సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఫీచర్‌ను ఈ మొబైల్‌లో పొందుపరిచినట్టు రియల్ మీ పేర్కొంది.