Smartphone : కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా.. భారీగా తగ్గిన ఈ ఫోన్‌పై లుక్కేయండి..!
ప్రధానాంశాలు:
Smartphone : కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా.. భారీగా తగ్గిన ఈ ఫోన్‌పై లుక్కేయండి..!
Smartphone : ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకున్న మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్స్‌తో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 12 నుంచి 17 వరకు జరగుతున్న GOAT సేల్ సందర్భంగా ఈ ఫోన్‌పై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దాదాపు రూ.8,000 వరకు ధర తగ్గింపుతో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
Smartphone : కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా.. భారీగా తగ్గిన ఈ ఫోన్‌పై లుక్కేయండి..!
Smartphone : తక్కువ ధరకే..
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.25,999 కాగా, ఇప్పుడు రూ.22,999కి లభిస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌కి దాదాపు మూడు వేలు తగ్గింది. ఇక ఇదే కాకుండా 5% బ్యాంక్ క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా రూ.17,650 వరకు తగ్గింపు ఉంటుంది. ఉదాహరణకి, మీ పాత ఫోన్ విలువ రూ.8,000 అయితే, ఈ ఫోన్‌ను కేవలం రూ.15,000కే పొందే అవకాశం ఉంటుంది!
స్పెసిఫికేషన్లు చూస్తే.. డిస్‌ప్లే: 6.67 అంగుళాల pOLED, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3D కర్వ్డ్ డిజైన్, వీగన్ లెదర్ బ్యాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ బాడీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 5,500mAh, 68W టర్బో ఛార్జింగ్ బ్యాటరీ, హలో UI ఆధారిత Android 15 ఓఎస్, Google Gemini ఆధారిత స్మార్ట్ అసిస్టెన్స్ ఏఐ ఫీచర్ తో పాటు 50MP ప్రైమరీ + 13MP అల్ట్రా వైడ్ | 32MP సెల్ఫీ కెమెరా ఆప్షన్స్ ఉన్నాయి.