Realme GT 2 Pro : అద్భుతమైన ఫీచర్లతో రానున్న రియల్ మీ జీటీ 2 ప్రో.. ధరెంతో తెలుసా?
Realme GT 2 Pro : భారత్ లో రియల్ మీ ఫోన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో జియోమీ, వివో, వన్ ప్లస్ లాంటి ఎన్నో బ్రాండ్స్ ఉన్నా.. రియల్ మీ ఫోన్లకు బాగానే డిమాండ్ ఉంటుంది. తాజాగా రియల్ మీ జీటీ 2 ప్రో పేరుతో స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.నిజానికి ఈ ఫోన్ రెండు నెలల కిందటే చైనాలో విడుదలైంది.
త్వరలోనే భారత్ లో కూడా లాంచ్ కానుంది. మార్చి చివరి వారంలో ఈ ఫోన్ భారత్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.6.7 ఇంచుల డిస్ ప్లేతో రానున్న ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా,32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0 ఓఎస్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.

realme gt 2 pro phone to be launched in india
Realme GT 2 Pro : స్పెసిఫికేషన్లు ఇవే
ఇక.. రియల్ మీ జీటీ 2 ప్రో ధర భారత్ లో సుమారు రూ.46 వేల వరకు ఉంటుందని అంచనా. చైనాలో రిలీజ్ అయినప్పుడు ఆ ఫోన్ ధర 3899 యువాన్లుగా ఉంది. ఈ ఫోన్ ను యూరప్ లో కూడా లాంచ్ చేశారు. యూరప్ లో ఈ ఫోన్ ధర 649 యూరోలుగా ఉండేది. అంటే మన కరెన్సీలో 55 వేలు అన్నమాట.చైనాలో జీటీ 2 ప్రోతో పాటు జీటీ 2 ఫోన్ కూడా రిలీజ్ అయింది. కాకపోతే జీటీ2ను భారత్ లో రిలీజ్ చేయకుండానే జీటీ 2 ప్రోను రియల్ మీ రిలీజ్ చేస్తోంది.