ఓవైపు నిహారిక పెళ్లి.. మరోవైపు తన పెళ్లి బ్రేకప్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్?
ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ నిహారిక పెళ్లి. మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక పెళ్లికి అటెండ్ అయింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ తో పాటు.. పవన్ కొడుకు, కూతురు అంటే మాజీ భార్య రేణు దేశాయ్ కొడుకు, కూతురు అకీరా, ఆధ్య కూడా అటెండ్ అయ్యారు.

Renu Desai opens up about her marriage breakup
సరే.. అదంతా పక్కన పెడితే.. అసలు విషయం ఏంటంటే.. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్… తాజాగా నిహారిక పెళ్లి వేళ తన పెళ్లి బ్రేకప్ పై నోరు విప్పింది. తను ఇప్పటికే మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పవన్ తో బ్రేకప్ అయ్యాక ఏనాడూ తన పెళ్లి బ్రేకప్ గురించి నోరు విప్పని రేణు.. తాజాగా నిహారిక పెళ్లి రోజే నోరు విప్పడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఏ బంధమైనా.. విడిపోయిందంటే.. ఆ బంధం విడిపోవడానికి ఇద్దరూ కారణం అవుతారు. ఏ కారణంతో అయినా సరే.. విడిపోతే ఖచ్చితంగా విడిపోవడానికి ఒక కారణం ఉంటుందని ఖచ్చితంగా గ్రహించాలి. మీ జీవితంలో ఏం జరిగినా అది ఒక కారణంతో జరుగుతుంది. అది కర్మ కావచ్చు.. ఇంకేదైనా కావచ్చు. లవ్ బ్రేకప్స్ కానీ.. మ్యారేజ్ బ్రేకప్స్ కానీ అయినప్పుడు చాలామంది ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. చాలామంది డిప్రెషన్ లోకి వెళ్తారు. చీకట్లోకి వెళ్లిపోతాం. కానీ.. ఆ చీకట్లోనే మగ్గిపోకూడదు. బయటికి రావాలి. కొత్త లైఫ్ ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే.. నేను కూడా అవన్నీ అనుభవించాను. ఎంత మంది నీ చుట్టూ ఉన్నా.. నీ బాధలను నువ్వే తీర్చుకోవాలి. నీ సమస్యలను నువ్వే తీర్చుకోవాలి.. అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.
youtube.com/watch?v=GEhpUp3UERE&feature=emb_title