Revanth Reddy : కేసీఆర్.. సాగర్ లో సీమాంధ్ర పోలీసులు ఎందుకు? అందరి పేర్లు బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : కేసీఆర్.. సాగర్ లో సీమాంధ్ర పోలీసులు ఎందుకు? అందరి పేర్లు బయటపెట్టేసిన రేవంత్ రెడ్డి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 April 2021,1:35 pm

Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా సాగర్ ఉపఎన్నిక గురించే చర్చ. ఇంకా రెండు రోజుల్లో సాగర్ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారం ముగిసే సమయం కూడా సమీపిస్తుండటంతో.. అన్ని పార్టీలు తమ దూకుడును పెంచాయి. సాగర్ లో పోటీ ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే. అందుకే… ఈరెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఒకరిని మరొకరు ఎత్తిపొడుచుకోవడమే. మీరేం చేశారు అంటే మీరేం చేశారు అంటూ ఇరు పార్టీల నాయకులు కొట్టుకునే పరిస్థితి వరకు వచ్చింది. ఏది ఏమైనా సాగర్ ఉపఎన్నిక పోరు అనేది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

revanth reddy about sagar by poll

revanth reddy about sagar by poll

సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రెండు సార్లు సాగర్ లో బహిరంగ సభను నిర్వహించారు. తాజాగా హాలియాలో ఎన్నికల ప్రచార సభను సీఎం కేసీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని… రైతులను నట్టేట ముంచిన పార్టీ కాంగ్రెస్ అని.. జానారెడ్డి సాగర్ కోసం చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. సాగర్ లో అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Revanth Reddy : కుప్ప కళ్లంలో ఉంది.. దొంగలు వస్తారు జాగ్రత్త

అయితే… సీఎం కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ పైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎలాగైనా గెలవాలని కేసీఆర్ వ్యవహారాన్ని నడుపుతున్నారని… అందుకోసమే సీమాంధ్రకు చెందిన పోలీసులు, అధికారులను సాగర్ లో డిప్యూటీ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీలోని గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు లాంటి ప్రాంతాల నుంచి సీఐ, డీఎస్పీ క్యాడర్ పోలీసులను సాగర్ లో కేసీఆర్ దింపారు. వీళ్లందరినీ సాగర్ లోని ఏడు మండలాల్లో నియమించి… దాడులు చేసే ప్రణాళికలను సీఎం కేసీఆర్ రచించారు.. అని రేవంత్ ఆరోపించారు.

ప్రచారం ముగిశాక… ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్లు వెళ్లిపోతారు… అభ్యర్థులు వెళ్లిపోతారు కానీ ఎన్నికలు ముగిసేదాకా సాగర్ లో ఉండేది పోలీసులే. అందుకే తెలంగాణ పోలీసులను కాకుండా సీమాంధ్ర పోలీసులను సాగర్ లో దింపి… కాంగ్రెస్ నాయకులను బయపెట్టే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ నేతల మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ నాయకులు అందరూ అలర్ట్ గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నేతల మీదనే వాళ్లు దృష్టి పెట్టారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని, మనల్ని భయపెట్టి ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ వేశారు. అందుకే… ఏ చిన్న ఘటన జరిగినా అందరం నాయకులం ఐక్యంగా ఉండి ముందుకు వెళ్లాలి. వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేద్దాం. మనందరం కష్టపడి ఈ రెండుమూడు రోజులు చాలా అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు కుప్ప కళ్లంలోని వచ్చింది. దాన్ని మనం ఇంట్లోకి తెచ్చుకోవాలి. జాగ్రత్తగా కష్టపడి మనం ఇంట్లోకి తెచ్చుకునే బాధ్యత మన మీద ఉంది… అంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది