Revanth Reddy : మునుగోడులో ఆ వర్గాన్ని నమ్ముకుంటున్న రేవంత్.. టికెట్ వారికేనా..?
Revanth Reddy : తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది మునుగోడు ఎన్నిక. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్,బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అందరి దృష్టి కాంగ్రెస్ మీద పడింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
Revanth Reddy : ఆ వర్గం వారికేనా..?
బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామ కన్ఫర్మేషన్ అయినట్టే. దీంతో కాంగ్రెస్ బీసీ క్యాండిడేట్ ని అక్కడ రంగంలోకి దించే అవకాశం కనబడుతోంది. ఇందుకు చెరుకు సుధాకర్ సరైన అభ్యర్థి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లను కొల్లగొట్టేందుకు రేవంత్ చెరుకు సుధాకర్ ను బరిలో దించునున్నాడు. ఇప్పటికే అధిష్టానానికి ఈ విషయాన్ని చేరవేసిన ట్లు సమాచారం. చెరుకు సుధాకర్ ను పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ కండువా కప్పి టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుస వినబడుతుంది. నియోజకవర్గంలో అత్యధిక భాగం ఓటర్లు బీసీలు కావడంతో రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మునుగోడులో బీసీలు 50 శాతం ఉన్నారు. గౌడ ఓట్లు 35,000 వేలు పద్మశాలీలు 32,000వేలు, ముదిరాజ్ ఓటర్లు 31,000 వేల మంది ఉన్నారు, యాదవుల ఓట్లు 26,000 వేలు ఉన్నాయి. మాదిగలు 25,000, మాలలు 11,000 ఉన్నారు, ముస్లింలు 6వేల మంది ఉన్నారు.
ఎస్టీలు 11,000 ఉన్నారు. ఇలా మొత్తం 90 శాతం ఓటర్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. అగ్రవర్ణాల వారు 7,600 మాత్రమే ఉన్నారు. ఇందులో కమ్మవారు 5,000 మంది, వెలమ వాళ్లు 2,500 మంది ఉన్నారు. ఆర్య వైశ్య, బ్రాహ్మణ వర్గాలకు చెందిన వారు 4 వేల మంది ఉన్నారు. చెరుకు సుధాకర్ కు టికెట్ ఇస్తే 90 శాతం ఓట్లు ఆయనకే పడతాయని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లాంటి వారికే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మొదటిసారిగా ఒక బీసీ కి టికెట్ ఇవ్వడంతో సీన్ మారే అవకాశం ఉందని అనుకున్న స్థాయిలో ఓట్లు రాబట్టే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి దేశవ్యాప్తంగా ప్రభావం కోల్పోయిన కాంగ్రెస్ మునుగోడు లో నైనా సత్తా దాటుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.