Revanth Reddy : రేవంత్ రెడ్డి సీన్ సితార్ అయిపోయింది.! కారణమేంటంటే.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : రేవంత్ రెడ్డి సీన్ సితార్ అయిపోయింది.! కారణమేంటంటే.!

 Authored By prabhas | The Telugu News | Updated on :3 July 2022,6:00 am

Revanth Reddy : ఎలాంటి పార్టీ.. ఎలా తయారయ్యింది.? కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్న మాటలివి. నిజమే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బోల్డంత క్యాడర్ వుంది. బలమైన నాయకులూ వున్నారు. అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని.. అన్న చందాన తయారైంది కాంగ్రెస్ పార్టీ. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులెత్తేసింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ అంతే. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జస్ట్ పోటీ ఇచ్చిందంతే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓ మోస్తరుగా సత్తా చాటింది.

వాస్తవానికి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. కానీ, ఆ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఎప్పుడో దూకేశారు. కొందరు మంత్రులయ్యారుకూడా.గతం గతః భవిష్యత్తు మాటేమిటి.? రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ఊపు వచ్చినట్లే వచ్చి, ఆ తర్వాత చప్పబడిపోయింది. రేవంత్ రెడ్డి తాను చెయ్యాల్సిన హంగామా అంతా చేస్తూనే వున్నారు. రేవంత్ రెడ్డి కేంద్రంగానే కాంగ్రెస్ పార్టీలో రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని లేవదీయాలని రేవంత్ ప్రయత్నిస్తోంటే, రేవంత్ రెడ్డిని పడగొట్టేయాలని కాంగ్రెస్ నేతల్లో చాలామంది చూస్తున్నారు. ఈ అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ డీలా పడుతున్నవేళ, అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది.

Revanth Reddy Was Sidelined

Revanth Reddy Was Sidelined

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కి బలమైన ప్రతిపక్షం బీజేపీనే.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ‘తెలంగాణలో కేసీయార్ సర్కారుని దించేసి, అధికార పీఠమెక్కేది మేమే..’ అని బీజేపీ బల్లగుద్ది మరీ చెబుతోంది. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కేసీయార్ తొందరపడితే, ఈ ఏడాదిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశమే కనిపించడంలేదాయె. సో, ఇదంతా చూస్తోంటే, రేవంత్ రెడ్డి సీన్ సితార్ అయిపోయినట్టే కదా.? వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ కాంగ్రెస్ పార్టీలో వుంటారా.? ఈలోగానే ఆయన జెండా మార్చేస్తారా.? వేచి చూడాల్సిందే.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది