Multibagger Stock : దూసుకుపోతున్న మల్టీ బ్యాగర్ స్టాక్.. ఐదు నెలల్లో కాసుల పంట
Multibagger stock : ఈ ఏడాది పెన్నీ షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. ఇన్వెస్టర్లకు ఏకంగా 2500 శాతం మేర లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 30 పెన్నీ స్టాక్‌లు ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. వీటిలో కొన్ని స్టాక్స్ గత ఐదు నెలల్లో 600 శాతానికి పైగా పరుగులు పెట్టాయి. తక్కువ ధరకే లభించే ఈ పెన్సీ స్టాక్స్.. ఇన్వెస్టర్లకు ఊహించని విధంగా లాభాలు తీసుకొచ్చాయి. మల్టీబ్యాగర్ స్టాక్.. ఈ పేరు వింటే చాలు.. ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే మల్టీబ్యాగర్ స్టాక్స్ కూడా తక్కువ సమయంలోనే అధిక లాభాలను తెచ్చిపెడతాయి.
అందుకే మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. 2022లో జనవరి నుంచి మే 31 వరకు ప్రింటింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ కైజర్ కార్పొరేషన్ షేరు ధర ఏకంగా 2,484 శాతం ర్యాలీ చేసింది. రూ.2.79 నుంచి రూ.72.1కు పెరిగింది. మెటల్ మర్చంట్ సంస్థ హెమాంగ్ రిసోర్సెస్ రెండో స్థానంలో ఉంది. ఈ షేర్ 1225 శాతం పెరిగింది. రూ.3.09 నుంచి రూ. 40.95కు చేరింది. అలాగే అలియెన్స్ ఇంటిగ్రేటెడ్ మెటాలిక్స్ 1070 శాతం పెరిగింది. రూ. 2.71 నుంచి రూ. 40.95కు ఎగబాకింది. అలాగే గ్యాలప్స్ ఎంటర్‌ప్రైజెస్, మిండ్ ఇండియా ఇండస్ట్రీస్, బీఎల్ఎస్ ఇన్ఫోటెక్ షేర్లు వరుసగా 985 శాతం, 825 శాతం, 675 శాతం చొప్పున ర్యాలీ చేశాయి.
డెలిజెంట్ ఇండస్ట్రీస్, కూబ్‌సూరల్ షేర్లు 400 శాతానికి పైగా పరుగులు పెట్టాయి. క్రెసాండా సొల్యూసషన్స్, లెషా ఇండస్ట్రీస్, జైహింద్ సింథటిక్స్, పీఏఓఎస్ ఇండస్ట్రీస్, టోయమ్ ఇండస్ట్రీస్, ప్రో ఫిన్ క్యాపిటల్ సర్వీసెస్, స్టెప్ టు కార్పొరేషన్, త్రివేణి గ్లాస్, ఎలిగ్యాంట్ ప్లోరికల్చర్ అండ్ అగ్రోటెక్ షేర్లు 200 నుంచి 400 శాతం వరకు పరుగులు పెట్టాయి. ఎన్2ఎన్ టెక్, బెకాయ్ నిరియత్, ఎంపీఎస్ ఇన్ఫోటెక్నిక్స్, బీసీఎల్ ఎంటర్‌ప్రైజెస్, సిండ్రెల్లా ఫైనాన్షియల్, టినే అగ్రో, మోడ్రన్ స్టీల్స్, గిలండా ఫైనాన్స్, గోల్డ్ లైన్ ఇంటర్నేషనల్, ఆర్ఎస్ఈసీ ఇంటర్నేషనల్, ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఇంజినీరింగ్, సులభ్ ఇంజినీరింగ్స్, నిక్కీ గ్లోబల్ వంటి షేర్లు కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్ అందించాయి.