Rohit Sharma : ముంబై జట్టు వీడనున్న రోహిత్ శర్మ.. నెక్స్ట్ ఎందులో అంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rohit Sharma : ముంబై జట్టు వీడనున్న రోహిత్ శర్మ.. నెక్స్ట్ ఎందులో అంటే..?

 Authored By ramu | The Telugu News | Updated on :24 July 2024,7:00 pm

Rohit Sharma : ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఇంకా టైం ఉన్నా ఈసారి ఆటగాళ్ల మార్పిడి భారీగా జరుగుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్స్ మీద ఇతర టీం లు కన్నేసి ఉంచాయి. మెగ వేలానికి టైం ఉన్నా కూడా రిటెషన్ ప్రక్రియలో నలుగురు ఐదుగురు ఆటగాళ్లను తీసుకునే ఛాన్స్ ఉండటంతో జట్లన్నీ మారిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ని వీడతాడని ప్రచారం జోరందుకుంది. ఈ వార్తలకు రావడానికి ముఖ్య కారణం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ని తీసి హార్ధిక్ ని పెట్టడమే. రోహిత్ శర్మని కాదని హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతో రోహిత్ అసంతృప్తిగా ఫీల్ అయ్యాడు. రీసెంట్ ఐపిఎల్ సందర్భంగ కేకే ఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ కూడా ఆమధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతనితో రోహిత్ ముంబై జట్టుతో తన ప్రయాణం ముగిసిందని అభిషేక్ తో రోహిత్ అన్నాడు.

Rohit Sharma ఇతర జట్ల నుంచి రోహిత్ కు కెప్టెన్సీ ఆఫర్..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రాడ్ కాస్టర్స్ మీద కూడా రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ తో పాటు సూర్య కుమార్, బూమ్రాలు కూడా ముంబై ఇండియన్స్ ని రిటెషన్ కు ఒప్పుకునే ఛాన్స్ లేదని అంటున్నారు. ఐతే వీరికి ఇతర జట్ల నుంచి కెప్టెన్ ఆఫర్ రావడంతో ముంబై ఇండియన్స్ ని వీడాలని అనుకుంటున్నారట.

Rohit Sharma ముంబై జట్టు వీడనున్న రోహిత్ శర్మ నెక్స్ట్ ఎందులో అంటే

Rohit Sharma : ముంబై జట్టు వీడనున్న రోహిత్ శర్మ.. నెక్స్ట్ ఎందులో అంటే..?

రోహిత్ శర్మకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ నుంచి కెప్టెన్సీ ఆఫర్ వచ్చినట్టు టాక్. అయితే ఆర్సీబీ లోకి కూడా రోహిత్ వెళ్లే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. ఈమధ్యనే టీం ఇండియా కోచ్ గా బాధ్యత నుంచి తొలగిన రాహు ద్రావిడి ఆర్సీబీకి హెడ్ కోచ్ గా భాధ్యత తీసుకుంటాడని తెలుస్తుంది. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఎంపికైతే రోహిత్ శర్మని కూడా ఆర్సీబీ లోకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే కోహ్లి, రోహిత్ శర్మ ఒకే జట్టులో ఐపిఎల్ ఆడే ఛాన్స్ ఉంది. మరి రిటెన్షన్ టైం లో ఎవరు ఏ జట్టు నుంచి వెళ్తారన్నది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది