Sajjanar | స్టాలిన్ సినిమా తరహాలో సజ్జనార్ కొత్త ఛాలెంజ్.. అదరహో అంటున్న నెటిజన్స్
Sajjanar | తెలంగాణ ఆర్టీసీ ఎండీగా విజయవంతంగా నాలుగేళ్లు సేవలందించిన వీసీ సజ్జనార్ ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి తక్కువ సమయంలోనే తన ప్రత్యేక గుర్తింపును చూపిస్తున్నారు. నగర ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఆయన చేపట్టిన తాజా ప్రచారం ‘సేఫ్ రైడ్ ఛాలెంజ్’.
#image_title
కొత్త ఛాలెంజ్
ఈ కార్యక్రమం ద్వారా వాహనదారుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనాన్ని నడిపించే ముందు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం లాంటి భద్రతా చర్యలను పాటిస్తూ, ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక చిన్న వీడియో లేదా ఫోటో తీసి, దానిని తన ముగ్గురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.
“సేఫ్టీ ఎప్పుడూ ఫ్యాషన్ అవుట్ కాదు. మీ ప్రతి ప్రయాణం మీరే కాదు, మీకు ఇష్టమైన వారిని కూడా రక్షించుకునే నిర్ణయంతో మొదలవ్వాలి” అన్నారు సజ్జనార్. ప్రత్యేకంగా యువతలో ట్రాఫిక్ భద్రతపై చైతన్యం కల్పించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు.‘సేఫ్ రైడ్ ఛాలెంజ్’ ఉద్యమంగా మారాలని, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. “మనందరం కలిసి 2025లో ‘సేఫ్టీ’ను కూలెస్ట్ ట్రెండ్‌గా మార్చుదాం,” అంటూ ప్రజల్లో సానుకూలత రేపే సందేశం ఇచ్చారు.