East godavari.. గుంతల మయంగా కేశనపల్లి రహదారి

Authored By praveen T | The Telugu News | Published on: September 7, 2021, 11:00 pm

ఏపీలో రోడ్లన్ని అధ్వానంగా ఉన్నాయని, వాటిని వెంటనే బాగు చేయాని జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిని వివరించేందుకుగాను పలు ఫొటోలను జనసేన నేతలు ప్రదర్శిస్తున్నారు. కాగా, జిల్లాలోని మలికిపురం మండలం కేశనపల్లి నుంచి వెళ్లే రహదారి అంతా గుంతల మయంగా మారిందని స్థానికులు చెప్తున్నారు. ఈ రహదారిలో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు.

స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు వివరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగు చేయాలని వేడుకుంటున్నారు. ఇకపోతే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేయాలని అధికారులకు సమీక్షా సమావేశం సందర్భంగా సూచించారు. వర్షాలు ఆగిపోయాక యుద్ధప్రాతిపదికన రోడ్లన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏపీలోని రోడ్ల విషయమై తాడేపల్లిలోని సీఎం ఆఫీసులో జగన్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

 

praveen T

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp