Samsung laptops : మార్కెట్ లోకి సామ్ సంగ్ ల్యాబ్‌టాప్స్.. ధర ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samsung laptops : మార్కెట్ లోకి సామ్ సంగ్ ల్యాబ్‌టాప్స్.. ధర ఎంతో తెలుసా?

 Authored By mallesh | The Telugu News | Updated on :19 March 2022,7:40 am

Samsung laptops : సామ్ సంగ్ కంపెనీ తన బ్రాండ్ ల్యాప్ టాప్స్‌ను భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ప్రీమియమ్ నుంచి బడ్జెట్ వరకు ఆయా రేంజ్‌లలో వీటిని తీసుకొచ్చింది. గెలాక్సీ బుక్ 2 360 సిరీస్, గెలాక్సీ బుక్ 2 సిరీస్.. గెలాక్సీ బుక్ 2 బిజినెస్.. గెలాక్సీ బుక్ గో వంటి ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్ చేసింది. ఒకేసారి ఆరు ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసింది. ఇందులో కొన్ని 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో రిలీజ్ కాగా.. బడ్జెట్ ల్యాపీ సామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్ గో స్నాప్‌డ్రాగన్ చిప్‌తో విడుదల చేశారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వీటిని తీసుకొచ్చారు.

సమ్ సంగ్ గెలాక్సీ బుక్ 2 ప్రో 360 ప్రారంభ ధర రూ.1,15,990గా ఫిక్స్ చేశారు. గెలాక్సీ బుక్ టూ ప్రో ప్రారంభ ధర రూ.1,06,990 కాగా, గెలాక్సీ బుక్ 2 360 స్టార్టింగ్ ప్రైజ్ రూ.99,990 గా ఉంది. గెలాక్సీ బుక్ గో ప్రారంభ ధర రూ.38,990 గా నిర్ణయించారు. గెలాక్సీ బుక్ 2 ప్రారంభ ధర రూ.65,990 ఉండగా, గెలాక్సీ బుక్ 2 బిజినెస్ ప్రారంభ ధర రూ.1,04,990గా నిర్ణయించారు.

samsung laptops launched

samsung laptops launched

Samsung laptops : బడ్జెట్ ధరలో..

సామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్ 2 ప్రో సిరీస్ ప్రీ రిజర్వేషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. గెలాక్సీ బుక్ 2 బిజినెస్‌తో పాటు గెలాక్సీ గో ల్యాప్‌టాప్స్ ప్రీ బుకింగ్ సైతం సామ్‌సంగ్‌ వెబ్‌సైట్‌ లో స్టార్ట్ అయింది. గెలాక్సీ బుక్ 2 360, గెలాక్సీ బుక్ 2 సేల్‌ త్వరలోనే ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. ప్రీ రిజర్వేషన్, ప్రీ బుకింగ్స్ పైన రూ.5000వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ల్యాప్ టాప్స్ బడ్జెట్ ప్రైస్ లోనే వస్తున్నాయి. కాబట్టి ఇవి ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోయే చాన్స్ ఉంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది