Sania Mirza : షోయబ్ మాలిక్ కి దూల తీరిపోయేలా సానియా మీర్జా ప్రెస్ మీట్ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sania Mirza : షోయబ్ మాలిక్ కి దూల తీరిపోయేలా సానియా మీర్జా ప్రెస్ మీట్ ?

 Authored By sandeep | The Telugu News | Updated on :14 November 2022,5:00 pm

Sania Mirza : ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌లు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ఇందులో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క అంద‌రు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. కొద్ది రోజులుగా షోయ‌బ్ మాలిక్, సానియా మీర్జాల విడాకుల‌కి సంబంధించిన తెగ ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. వీరిద్ద‌రు కొన్నాళ్ళు డేటింగ్ చేసిన అనంతరం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఇటీవల వీరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి.

కొద్ది రోజులుగా వ‌స్తున్న వార్త‌ల‌పై సానియా, షోయబ్ దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే షోయ‌బ్ మాలిక్ దూల తీరిపోయేలా సానియా మీర్జా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ‌నుంద‌ట‌. అందులో షోయ‌బ్ బాగోతాలు అన్ని బ‌య‌ట‌పెట్ట‌నుంద‌ట‌. మోడ‌ల్‌తో చేసే ర‌చ్చ‌తో పాటు ఇత‌ర వ్య‌వ‌హారాల‌కి సంబంధించి క్లారిటీ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు. ఇండియా టెన్నిస్ స్టార్ సానియా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్‌లు 2010లో పెళ్లి చేసుకుని దుబాయ్‌లో కాపురం పెట్టగా, ఈ కపుల్‌కు 2018లో కుమారుడు ఇజాన్ అనే బుడ‌త‌డు జన్మించాడు.

sania mirza press meet on Shoaib Malik

sania mirza press meet on Shoaib Malik

Sania Mirza : నిజ‌మేంటి?

షోయబ్ పాకిస్థానీ మోడల్ అయేషా ఒమర్‌తో డేటింగ్ చేస్తుంండం వ‌ల‌నే సానియాతో విడిపోతున్నట్టు కొన్ని వెబ్‌సైట్స్ రాసుకొచ్చాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఈ జంట మౌనం పాటిస్తూనే ఉంది. మ‌రి త్వ‌ర‌లో అయిన దీనిపై స్పందిస్తుందా అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని వారాల నుంచి షోయబ్ మాలిక్ సానియా మీర్జా విడిపోతున్నారు అని కథనాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ కావ‌డం వారి అభిమానుల‌ని ఎంత‌గానో వేధించింది వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అని అందుకే కుటుంబ సమక్షంలో చర్చించుకున్న తర్వాత విడిపోవాలని డిసైడ్ అయినట్లు కూడా బాలీవుడ్ మీడియాలో కొన్ని క‌థ‌నాలు ప్ర‌చురించారు. వీటిపై క్లారిటీ అయితే రాలేదు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది