Health Tips | రాత్రి పడుకునే ముందు ఈ జ్యూస్ ఒక గ్లాస్ తాగితే చాలు… జీర్ణ సమస్యలకు చెక్
Health Tips | మన వంటగదిలో సుగంధ ద్రవ్యాల సంఖ్య చాలాఎక్కువ. వాటిలో లవంగం ఒకటి, పరిమాణంలో చిన్నదైనా, ఆరోగ్య ప్రయోజనాల్లో మాత్రం చాలా పెద్దది. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట లవంగాల నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
#image_title
ఇప్పుడు ఈ లవంగాల నీరు ఎలా తయారు చేయాలి? దీని లాభాలు ఏమిటో చూద్దాం.
ఒక కప్పు వేడి నీటిలో 5-7 లవంగాలు వేసి 10-15 నిమిషాలు నానబెట్టండి.
అది గోరువెచ్చిగా ఉన్నప్పుడే త్రాగండి.
రుచి కోసం తేనె లేదా నిమ్మరసం కలిపి తాగొచ్చు.
ఈ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి.
లవంగాల నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
1. నిద్రకు సహాయం
లవంగాలలో ఉండే యూజెనాల్ (Eugenol) అనే పదార్థం సహజ మత్తుమందుగా పనిచేస్తుంది. ఇది:
త్వరగా నిద్ర పట్టడానికి, రాత్రంతా నిద్ర సౌకర్యంగా సాగడానికి, అర్థరాత్రి లేచే అలవాట్లను తగ్గించడానికి సహాయపడుతుంది.
2. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
లవంగాలలోని నూనెలు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజితం చేస్తాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు నివారణ, అతిగా తిన్నప్పుడు కడుపు తేలికగా ఉండేందుకు సహాయం, జీవక్రియ రేటును మెరుగుపరచడం ద్వారా శరీరం శక్తిని బాగా వినియోగించుకోవడం జరుగుతుంది.
3. మౌత్ ఫ్రెష్‌నర్ & గొంతు సమస్యలకు చెక్
లవంగాల యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలో బ్యాక్టీరియాను తొలగించి దుర్వాసన తగ్గిస్తాయి.. గోరువెచ్చని లవంగం నీటితో పుక్కిలించడం వల్ల గొంతు నొప్పికి ఉపశమనం లభిస్తుంది
4. కాలేయ శుద్ధి & రోగనిరోధక శక్తి
లవంగాల నీరు రాత్రి సమయంలో శరీర డిటాక్స్ ప్రక్రియను మద్దతిస్తుంది. కాలేయాన్ని శుభ్రపరచడం, శరీరంలో వ్యర్థాల తొలగింపు. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల దాడిని అడ్డుకుంటుంది