Sonu Sood : అయ్యో.. బోలెడు సమాజ సేవ చేస్తున్న సోనూసూద్ కూడా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది?
Sonu Sood : చట్టం ముందు అందరు సమానులే అంటారు. అయితే కొన్ని సార్లు చట్టం ముందు కొందరికి మినహాయింపు ఇస్తే ఏం కాదు అనేది కొందరి అభిప్రాయం. సోనూసూద్ కు ముంబయి హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆయనకు వ్యతిరేంగా తీర్పు ఇవ్వడం పట్ల కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సాదారణంగా అయితే సోనూసూద్ కు జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. కాని సోనూసూద్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన చేసింది చిన్న తప్పు అయినా దాన్ని మంచి పని కోసం ఉపయోగించినా కూడా తప్పు చేశారు అంటూ తీప్పు ఇచ్చింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు కు సోనూ సూద్ వెళ్లాడు.
అసలు విషయం ఏంటంటే:
ముంబయిలోని జుహూ ప్రాంతంలో సోనూసూద్ కు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిని మున్సిపల్ కార్పోరేషన్ అనుమతులు తీసుకోకుండానే హోటల్ గా మార్చేశాడు. లాక్ డౌన్ సమయంలో ఆ హోటల్ లో వలస కార్మికులను మరియు సహాయం కావాల్సిన వారిని ఉంచారు. కాని మున్సిపల్ కార్పోరేషన్ వారు మాత్రం నివాస ప్రాంతంలో ఉన్న భవనంను నివాసం కోసం కట్టిన భవనంను హోటల్ గా మార్చడంను తప్పుబట్టింది. అందుకు కనీసం అనుమతి కూడా తీసుకోలేదు. దాంతో ఆ హోటల్ ను మూసి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను రద్దు చేయాలని సోనూసూద్ హైకోర్టుకు వెళ్లాడు. కోర్టులో సోనూసూద్ కు ఎదురు దెబ్బ తగిలింది. నివాస యోగ్యంగా ఉన్న ఇంటిని హోటల్ గా మార్చడంను తప్పుబట్టింది. దాంతో సోనూసూద్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
సుప్రీం కోర్టులో అయినా న్యాయం దక్కేనా
హై కోర్టులో నిరాశ మిగలడంతో సుప్రీం కోర్టుకు వెళ్లి ఆ భవనంను హోటల్ కు వినియోగించుకునేందుకు అనుమతులు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే సుప్రీం కు వెళ్లగా ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ వారికి నోటీసులు వెళ్లాయి. ప్రతి వాదిగా మున్సిపల్ కార్పోరేషన్ ను చేర్చడంతో మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుంది. ఎన్నో మంచి పనులు చేసి నలుగురికి ఉపయోగపడ్డ సోనూసూద్ విషయంలో చూసి చూడనట్లుగా ఉండాలని, మంచి చేసే వారికి ఇలా చేస్తే వారు చేయాలనుకున్న మంచి కూడా చేయక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కోర్టు మరియు ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ వారు కాస్త ఆలోచించాలంటూ సోనూసూద్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.