Chicken Pakodi : స్ర్టీట్ స్టైల్ చికెన్ పకోడీని ఇలా చేయండి. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken Pakodi : స్ర్టీట్ స్టైల్ చికెన్ పకోడీని ఇలా చేయండి.

 Authored By prabhas | The Telugu News | Updated on :22 July 2022,7:00 pm

Chicken Pakodi : వర్షాకాలంలో ఒకపక్క వాన పడుతుంటే, మరోపక్క వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. అందులో ఎక్కువగా పకోడీని తినాలనిపిస్తుంటుంది. అయితే పకోడీని ఉల్లిపాయతో కాకుండా చికెన్ తో చేసుకొని తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేం. అటు వర్షం పడుతుంటే, ఇటు వేడివేడిగా స్పైసీగా చికెన్ పకోడీ తింటే మామూలుగా ఉండదు. అయితే చికెన్ పకోడీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా స్ట్రీట్ స్టైల్ లో, అస్సలు నూనె పీల్చకుండా, కరకరలాడే చికెన్ పకోడీని తయారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే కరకరలాడే చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు : 1) చికెన్ 2) పచ్చిమిర్చి 3) బియ్యం పిండి 4) కార్న్ ఫ్లోర్ 5) ఆయిల్ 6)ఉప్పు 7) పసుపు 8) నిమ్మకాయ 9) అల్లం వెల్లుల్లి పేస్ట్ 10) కారంపొడి 11) ధనియాల పొడి 12) జీలకర్ర 13) గరం మసాలా పొడి 14) మిరియాల పొడి 15) చాట్ మసాలా 16) కరివేపాకు 17) పుదీనా 18) కొత్తిమీర

Cooking process of Chicken Pakodi

Cooking process of Chicken Pakodi

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కేజీ చికెన్ వేసుకొని, రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, సగం నిమ్మకాయ రసం, రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర, ఒకటిన్నర టీ స్పూన్ల గరం మసాలా, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ చాట్ మసాలా, రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన పుదీనా, కొద్దిగా కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అర టీ స్పూన్ ఆయిల్, ఒక ఎగ్గును కార్చుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని ఒక గంట పాటు ప్రక్కన ఉంచాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసి, మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పకోడీ లాగా వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీగా స్పైసి స్పైసిగా చికెన్ పకోడీ రెడీ..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది