sukumar : చదువుకున్న పాఠశాలకు సాయమందించిన సుకుమార్
East godavari : సినీ దర్శకుడు సుకుమార్ తన స్వగ్రామమైన పట్టమర్రులో ఎమ్మెల్యే రాపాకతో కలిసి రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ… పట్టుమర్రి గామాభివృద్ధిరి ఎప్పుడూ ముందుంటానని తెలిపాడు. తాను చదువుకున్న పాఠశాలలో తండ్రి తిరుపతి నాయుడు పేరుతో భవనం నిర్మించి, ప్రారంభించిన క్షణాలను మర్చి పోలేమన్నారు. చిన్నప్పుడు తాను చదువుకున్న తరగతి గదులను చూసి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ సుకుమార్ చదువుకుంటున్నప్పుడు పాఠశాలలో సాధించిన భహుమతులను భద్రపరిచి ఫ్రేమ్ కట్టించి వేదికపై భహూకరించడంతో తనకు ఎంతో ప్రత్యేకమైన భహుమతి ఇదని ఎంతో ఆనందపడ్డారు. కుటుంబసభ్యుతో కలిసి పాఠశాల భవనాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎంత చేసినా పుట్టిన ఊరికి, తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేమని ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మాట్లాడుతూ కొడిడ్ కష్టకాలంలో సుకుమార్ రాజోలులో రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేశాడు. వీటితోపాటు అమలాపురం లోని కొన్ని స్వచ్ఛంద సంస్థలకు రూ. 17 లక్షల రూపాయలతో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందిచారని పేర్కొన్నారు.
sukumar : సెప్టెంబర్‌లో పుష్ప పునః ప్రారంభం
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్నా హీరో హీరోహిన్లు గా తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప సెప్టెంబర్ పునః ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. స్థానిక మారేడుపల్లి అటవీ ప్రాంతంలో మళ్లీ సినిమా పునః ప్రారంభం కానున్నట్లు విలేకరులకు తెలిపారు. త్వరలో సినిమా పూర్తి చేసి ప్రేక్షలకులకు అందించి వెంటనే పుష్ప సీక్వెల్ పుష్ప- 2 ప్రారంభం కానున్నట్లు తెలిపారు.