Weak Immunity System : ఈ లక్షణాలు మీలో ఉంటే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్టే..!
Weak Immunity System : మనిషి ఆరోగ్యంగా బతకాలంటే.. ఎటువంటి రోగాలు శరీరంలోకి రాకుండా ఉండాలంటే.. వైరస్ లు అటాక్ చేయకుండా ఉండాలంటే కావాల్సింది రోగ నిరోధక శక్తి. దీన్నే మనం ఇమ్యూనిటీ అని కూడా అంటాం. ఇమ్యూనిటీ ఎంత తక్కువగా ఉంటే.. అన్ని రోగాలు అటాక్ చేస్తాయి. ఇది ఎంత ఎక్కువగా ఉంటే.. రోగాలు శరీరంలో అడుగు పెట్టేందుకు కూడా భయపడాల్సిందే. ఇది పలు రకాల వైరస్ లు, రోగాలతో ఫైట్ చేసి.. అవి శరీరాన్ని దెబ్బ తీయకుండా అట్టుకుంటుంది. అందుకే.. రోగ నిరోధక శక్తి అనేది శరీరానికి ఎంతో అవసరం.
రోగ నిరోధక శక్తి సరిపడేంత ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు.. ఎటువంటి సమస్యలు రావు. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాం. అయితే.. చాలామందికి తమ శరీరంలో రోగ నిరోధక శక్తి సరిపోయేంత ఉందా? లేదా? అనేది తెలియదు. కొందరికి ఊరికే జ్వరాలు, దగ్గు, జలుబు వస్తుంటాయి. దీంతో తమ శరీరంలో రోగ నిరోధక శక్తి సరిపోయేంత లేదని అర్థం చేసుకుంటారు. నిజానికి.. రోగ నిరోధక శక్తి శరీరంలో తగ్గింది.. అని ఎలా తెలుసుకోవాలి. దాని లక్షణాలు ఏంటో ఇఫ్పుడు తెలుసుకుందాం.
Weak Immunity System : రోగ నిరోధక శక్తి తగ్గితే ఈ సమస్యలు వచ్చినట్టే
చాలామంది ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. టెన్షన్ పడుతుంటారు. ప్రతి చిన్నవిషయానికి ఆవేశ పడుతుంటారు. ఒక్కోసారి డిప్రెషన్ లోకి కూడా వెళ్తుంటారు. అటువంటి వాళ్లలో రోగ నిరోధక శక్తి తగ్గిందని తెలుసుకోవాలి. తరుచూ దగ్గు వచ్చినా.. జలుబు చేసినా.. జ్వరం వచ్చినా రోగ నిరోధక శక్తి తగ్గిందని అనుకోవాలి. చాలామందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. కడుపు కూడా అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది. నీళ్ల విరేచనాలు అవుతుంటాయి. శరీరంలో ఎక్కడైనా గాయం అయితే అది అస్సలు మానదు. ఇన్ఫెక్షన్ల బారిన పడటం, ఏ పని చేయకున్నా అలసిపోవడం లాంటి సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిందని భావించాలి. రోగ నిరోధక శక్తి తగ్గితే వెంటనే రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారాన్ని తీసుకోవాలి. మంచి పౌష్ఠికాహారం తీసుకుంటే.. వెంటనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పై సమస్యలన్నీ తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.