YCP – TDP : వైసీపీ వేసిన ఐడియా దెబ్బకి డిఫెన్స్ లో పడిన తెలుగుదేశం పార్టీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP – TDP : వైసీపీ వేసిన ఐడియా దెబ్బకి డిఫెన్స్ లో పడిన తెలుగుదేశం పార్టీ

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 October 2022,7:30 am

YCP – TDP : ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఎన్నికల హడావుడి మాత్రం ఇంకా తగ్గలేదు. నిజానికి ఏపీలో రాజకీయాలు అంటే గుర్తొచ్చేది వైసీపీ, టీడీపీ. ఈ రెండు పార్టీలే గుర్తొస్తాయి. కానీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. ప్రస్తుతం ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులు అనేలా మారిపోయింది పరిస్థితి. ఎక్కడ చూసినా.. ఓవైపు అమరావతి ఉద్యమం.. మరోవైపు మూడు రాజధానుల అంశం.. ఈ రెండే ఏపీలో అట్టుడుకుతున్నాయి. ఇప్పటికే అమరావతినే రాజధానిగా ఉంచాలని అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

త్వరలోనే ఆ యాత్ర ఉత్తరాంధ్రకు చేరుకోనుంది. అందుకే.. మహా పాదయాత్రకు చెక్ పెట్టేందుకు వైజాగ్ లో వైసీపీ అధ్వర్యంలో వికేంద్రీకరణ గర్జనను నిర్వహిస్తోంది. మూడు రాజధానులే ముద్దు.. ఒక రాజధాని వద్దు అంటూ భారీ సభను నిర్వహించబోతున్నారు. ఈనెల 15 న ఈ సభను నిర్వహించనున్నారు. ఓవైపు ఆరోజు వైసీపీ భారీ సభను నిర్వహిస్తుంటే.. టీడీపీ కూడా అదే రోజు వైజాగ్ లో టీడీపీ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం నిర్వహించనుంది. అయితే.. వైసీపీ నిర్వహించబోయే గర్జనకు చాలామంది ప్రజాప్రతినిధులు, కీలక నేతలు రానున్నారు. గర్జనకు ముందు భారీగా ర్యాలీని నిర్వహించనున్నారు. ఆ తర్వాత మూడు రాజధానులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు వైసీపీ నేతలు.

tdp in defence after ycp vizag garjana meeting

tdp in defence after ycp vizag garjana meeting

YCP – TDP : అదే రోజు విశాఖలో టీడీపీ ఉత్తరాంధ్ర నేతలతో కీలక సమావేశం

వైసీపీ హైకమాండ్ కూడా ఈ గర్జనను చాలెంజింగ్ గా తీసుకుంది. ఓవైపు మహా పాదయాత్ర ఉత్తరాంధ్ర చేరుకునే సమయానికి వైసీపీ గర్జన పేరుతో సభను నిర్వహిస్తుండటంతో టీడీపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉత్తరాంధ్రకు రాజధానిని టీడీపీ వ్యతిరేకిస్తోంది అనే అప్రతిష్టను టీడీపీ మూటగట్టుకునేలా వైసీపీ ప్లాన్ చేయడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. దీన్ని ఎలా అధిగమించాలని టీడీపీ తెగ శ్రమిస్తోంది. అందుకే గర్జనకు పోటీగా వైజాగ్ లో అదే రోజు అమరావతిపై గళం వినిపించాలని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు టీడీపీ హైకమాండ్ చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ అక్టోబర్ 15న వైజాగ్ కు రావాలని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందట. మరి.. వైసీపీకి అక్టోబర్ 15న టీడీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది