YCP – TDP : వైసీపీ – టీడీపీ వేరు వేరు స్ట్రాటజీలు.. కానీ వర్క్ అయ్యేది ఇదే !
YCP – TDP : ఎన్నికల్లో ఏ పార్టీ స్ట్రాటజీ దానిదే. అవును.. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలనే అనుకుంటుంది. కానీ.. ఓడిపోవాలని కాదు. గెలవడం కోసం పార్టీల స్ట్రాటజీలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి వేరే పార్టీని బ్యాడ్ చేసి.. వేరే పార్టీ మీద బురద జల్లి అధికారంలోకి రావాలని అనుకుంటాయి. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. అధికార వైసీపీ మీద బురద జల్లడమే టీడీపీ స్ట్రాటజీ. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు కూడా హీటెక్కాయి.
ప్రధాన పార్టీలయిన వైసీపీ, టీడీపీలు తమ తమ వ్యూహాలను మార్చుకొని మరీ ముందుకు వెళ్తున్నాయి. నిజానికి.. అధికార పార్టీ వైసీపీ ప్రజలను ఇప్పుడు నమ్మించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినన్ని సంక్షేమ పథకాలను మరే ప్రభుత్వం తీసుకురాలేదు.ఆలు లేదు.. చూలు లేదు అన్న చందంగా చంద్రబాబు అప్పుడే తన మేనిఫెస్టోను ప్రకటించారు. అది కూడా వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలనే అటూ ఇటూ తిప్పి మళ్లీ అవే పథకాలను తన మేనిఫెస్టోలో పెట్టారు. వాటిని రెండు రకాలుగా డివైడ్ చేసి ఒకటి మహిళా సాధికారత, రెండోది రైతుల కోసం అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ చంద్రబాబు చేస్తున్న హడావుడిని ఏపీ ప్రజలు చూస్తూనే ఉన్నారు.
YCP – TDP : అప్పుడే మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం నమ్ముకున్నది ఒక్కటే. ఏపీలోని ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకం అందాలి. అది కూడా లబ్ధిదారులకే అందాలి.. అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తోంది. అందుకే కదా.. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. అసలు.. వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబే మెచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ పథకాలను కాపీ కొట్టారు. అంటే ఏపీలో వైసీపీ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారనే కదా అర్థం. ఇక.. నువ్వు ఎన్ని వ్యూహాలు రచించినా.. ఎంత బురద జల్లినా వేస్ట్.. అది నీ మీదే పడుతుంది చంద్రబాబు.