TDP : జగన్ మీద వజ్రాయుధం విసిరిన టీడీపీ… 2024 లో చావు దెబ్బ గ్యారెంటీ
TDP : ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ ఉండటం సహజం. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీపై, అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేయడం సహజం. తాజాగా ఏపీలోనూ అదే జరుగుతోంది. ఓవైపు వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో సంక్షోభం సృష్టించిందని టీడీపీ ఆరోపిస్తోంది. అంతే కాదు.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముందు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది. అన్నా క్యాంటీన్లను రద్దు చేయడంపై, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయడంపై, పండుగ కానుకలపై టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
వైసీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరి పీల్చుకోకుండా చేసింది టీడీపీ. ప్రతి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముందు టీడీపీ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని ఎందుకు రద్దు చేశారు.. పెళ్లి కానుక, పండుగ కానుకలు.. ఇలా అన్ని పథకాల రద్దుపై ప్లకార్డులు ప్రదర్శించారు. రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేసిన మోసం గురించి ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.
TDP : సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది
టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పలు పథకాల పేర్లను మార్చారని, వాటిని మార్చి సగం కూడా ఇవ్వడం లేదని టీడీపీ మండిపడింది. టీడీపీ అమలు చేసిన పథకాలను ఎందుకు రద్దు చేశారంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలే బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారంటూ చెప్పుకొచ్చారు. సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టి వైసీపీ ప్రభుత్వం సాధించేదేంటి. బడుగు, బలహీన వర్గాలను నాశనం చేస్తోంది.. అంటూ దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ నేతలు భలేగా ప్లాన్లు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డంగా బుక్ చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల తరుపున పోరాడేది కేవలం టీడీపీ పార్టీయేనని స్పష్టం చేస్తున్నారు.