70 ఏళ్ల వ‌య‌సులో భార్య‌ను కాపాడునేందుకు ఆ భ‌ర్త ప‌డ్డ క‌ష్టాన్ని చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వు.. చివ‌రికి ఏం జ‌రిగిందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

70 ఏళ్ల వ‌య‌సులో భార్య‌ను కాపాడునేందుకు ఆ భ‌ర్త ప‌డ్డ క‌ష్టాన్ని చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వు.. చివ‌రికి ఏం జ‌రిగిందంటే..?

భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది. భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉంటుంది. భార్య‌భ‌ర్త‌లు అంటే కలిసి ఉండటం కాదు కష్టాలలో కలిసి మెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే […]

 Authored By mallesh | The Telugu News | Updated on :7 April 2022,5:30 pm

భార్య భర్తల బంధం శాశ్వతం. ఒకరికొకరు శాశ్వతం. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది. భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉంటుంది. భార్య‌భ‌ర్త‌లు అంటే కలిసి ఉండటం కాదు కష్టాలలో కలిసి మెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్య భర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం. భర్త అనారోగ్యం గా ఉంటే ఏ భార్యా కూడా చూస్తూ ఊరుకోదు. తన పక్కనే ఉండి అన్ని సేవలు చేస్తుంది. భర్త కూడా భార్య పట్ల బాధ్యతగా ఉంటాడు.సమయం వచ్చినప్పుడు భార్యపై ప్రేమకు ప్రేమ‌ను పంచుతాడు.

పెళ్లి తర్వాత ఎంతో మంది చిన్న చిన్న గొడవలకు విడిపోతారు కానీ చివరి క్షణం కలిసి ఉన్నవాళ్ళదే నిజమైన భార్య భర్తల బంధం అవుతుంది. ఈ చిన్న సంఘ‌ట‌న భార్య భ‌ర్తుల ఎలా ఉండాలో గుర్తుచేసింది. ఒక భర్త తన భార్య ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సంఘ‌ట‌న అంద‌రిని క‌ల‌చివేస్తోంది.ఓ వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన భార్యను రెండు చక్రాల బండిపై హాస్పిటల్ కి తీసుకెళ్లిన ఘటన ఎంతో బాధ కరమైనది. ఉత్తరప్రదేశ్‌ బలియా జిల్లా చిల్ఖార్‌ బ్లాక్‌ అందౌర్‌ గ్రామానికి చెందిన సకుల్‌ ప్రజాపతి.. 55 సంవత్సరాల తన భార్య జోగిని రెండు చక్రాల బండిపై హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వచ్చింది. గ‌త నెలా మార్చి 28న జోగిని తీవ్ర అనారోగ్యంతో బాధప‌డింది. ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లేందుకు ఫోన్‌ చేసినా ఆంబులెన్స్‌ రాలేదు. సహాయం అడిగినా ఎవరూ స్పందించలేదు.

Tears do not stop when the husband sees the hardship of protecting his wife at the age of 70

 Tears do not stop when the husband sees the hardship of protecting his wife at the age of 70

 రెండు చక్రాల బండిపై హాస్పిటల్ కి…

ఇక వేరే మార్గం లేక తన బండిపై పడుకోబెట్టి 3 కి.మీ.ల దూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు.కాగా డాక్ట‌ర్ ఆమెను పరీక్షించి, మందులిచ్చి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంట‌నే ప్రజాపతి ఇంటికొచ్చి బట్టలు , డబ్బు తీసుకుని తిరిగి కొంత మంది స‌హాయంతో మినీ ట్రక్కులో బలియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె అక్కడే చ‌నిపోయింది. ఈ దృష్యాల‌ను మార్గ మ‌ధ్య‌లో కొంద‌రు ఫొటోలు వీడియోలు తీయ‌డంతో వైర‌ల్ అయ్యాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించారు. ఈ సంఘ‌న‌ట చూప‌రుల‌ను క‌ల‌చివేసింది. భార్య‌ను కాపాడుకోలేక నిస్స‌హాయ స్థితిలో ఉన్న‌ ఆ వృద్దుడిని చూసి కంట త‌డిపెట్టుకున్నారు. మాన‌వ‌త్వంతో ఎవ‌రో ఒక‌రు స్పందించి తొంద‌ర‌గా హాస్పిట‌ల్ కి తీసుకెళ్లుంటే ఆమె బ‌తికేద‌ని విచారం వ్యక్తం చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది