జమిలి ఎన్నికలకు నో చెబుతున్న కేసీఆర్, జగన్.. ఇద్దరికీ ఒకే టెన్షన్?
ఏంటో.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరుసగా ఢిల్లీకి పయనమవుతున్నారు. ఒకరు వెళ్లి రాగానే.. మరొకరు.. కేంద్ర మంత్రులు, ప్రధానితో భేటీ అవుతున్నాయి. అసలు.. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది. ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనను అంత సీరియస్ గా తీసుకుంటున్నారో తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు. అసలు.. ఇద్దరి పర్యటన వెనుక ఉన్న అంతర్యం ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.
ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిచింది కొత్త వ్యవసాయ చట్టాల గురించి చెప్పడం కోసం, జమిలి ఎన్నికల గురించి వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడం కోసం అనే వార్తలు వినిపిస్తున్నాయి.
కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతోంది అనే విషయం అందరికీ తెలిసిందే. బహుషా 2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జమిలి ఎన్నికలు అంటే అంత సాధారణమైన విషయం కాదు.. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాలి.. అన్ని రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి.. అప్పుడే జమిలి ఎన్నకలు జరుగుతాయి. కనీసం దేశంలోని 20 రాష్ట్రాలు ఓకే అంటే జమిలి ఎన్నికలు పట్టాలకెక్కుతాయి. తమ మిత్రపక్షాలతో పాటుగా.. ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. జమిలి ఎన్నికలకు ఎటువంటి ఆటంకం ఉండదని కేంద్రం భావిస్తోంది.
అందుకే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం కోసం కేంద్రం ఇద్దరినీ పిలిచినట్టు తెలుస్తోంది. అయితే.. మరి కేసీఆర్, జగన్.. ఇద్దరూ జమిలి ఎన్నికలకు ఓకే చెప్పారా? లేదా? అనేది తెలియనప్పటికీ.. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. వాళ్లు నో చెబుతారని అంటున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీ హవా నడుస్తోంది. సో.. కొన్ని రోజులు ఆగితే బెటర్ అని కొంచెం సమయం తీసుకొని.. తెలంగాణలో మళ్లీ పాగా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఆయన జమిలికి సై అనకపోవచ్చు.. అని అంటున్నారు.
సేమ్.. జగన్ కూడా అంతే.. ఆయన అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరే అయింది. ఒక టర్మ్ కూడా పూర్తి కాకుండా.. మధ్యలో ఎన్నికలంటే.. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసే అవకాశం ఉండదని.. అందుకే.. జగన్ కూడా జమిలి ఎన్నికలకు సై అనకపోవచ్చు.. అనే వార్తలు వినిపిస్తున్నాయి.