Kodali Nani : కొడాలి నాని జోస్యం అప్పుడు పులి పంజా.. ఇప్పుడు సింహం పంజా.!
Kodali Nani : ‘‘2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేశాయి.. పులి పంజా దెబ్బ రుచి చూశాయి. 2024 ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కలిసొస్తే, ఈసారి సింహం పంజా దెబ్బ రుచి చూడబోతున్నాయి.. ’’ అంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. వైఎస్ జగన్ మొదటి క్యాబినెట్‌లో కీలక మంత్రిగా పని చేసిన కొడాలి నాని, తాజా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు కోల్పోయారు.
అయితే, పార్టీ పరమైన పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగానే కొడాలి నానికి హామీ ఇచ్చారు.అన్న మాట ప్రకారం పదవి ఇచ్చారు కూడా. ‘వైఎస్ జగన్ మాకు పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తాం..’ అని కొడాలి నాని, పేర్ని నాని తదితరులు గతంలోనే చెప్పారు, ఆ మాటకు కట్టుబడి వున్నారు.మంత్రి పదవి పోయాక, కొన్ని రోజులు కాస్త శాంతంగా వున్న కొడాలి నాని, మళ్ళీ జూలు విదిల్చారు.

Then Tiger, Now Lion.. Kodali Nani About Ys Jagan
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా తనదైన విమర్శలతో విరుచుకుపడ్డారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 51 శాతం ఓటు బ్యాంకు వుందనీ, ఆ మిగిలిన 49 శాతం ఓటు బ్యాంకులో ఎవరెన్ని పంచుకుంటారో అది వాళ్ళ ఇష్టమంటూ కొడాలి సెటైర్లు వేశారు. దత్త పుత్రుడు, చేతకాని పుత్రుడు, ముసలి చంద్రబాబు.. పట్ల ప్రజలు అప్రమత్తంగానే వున్నారన్నది కొడాలి వాదన.2024 ఎన్నికల్లో 151 సీట్లకు మించి సత్తా చాటుతామని కొడాలి నాని కుండబద్దలుగొట్టేస్తున్నారు.