Funerals : అంత్యక్రియల సమయంలో డప్పు శబ్దాలురు ఎందుకు చేస్తా? దీని వెనుక శాస్త్రీయత ఉందట..
Funerals : వ్యక్తి చనిపోయాక మనదేశంలో అతని బాడీగా చాలా గౌరవంగా చూసుకుంటారు. విదేశాల గురించి తెలియదు కానీ మన దేశంలో మాత్రం చనిపోయిన వారిని దైవంతో సమానంగా కొలుస్తారు. మతాల వారీగా వారి ఆచారాల ప్రకారం ఈ తంతు కొనసాగిస్తారు. పూల మాలలు వేస్తారు. పూలు చల్లుతూ, డప్పుల శబ్ధం చేస్తూ ఊరేగిస్తారు. వారి పాడె చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తులసి తీర్థం పోస్తారు. నోట్లో బియ్యం పోస్తారు. పాడె చుట్టూ తిరుగుతూ కుండకు చిల్లులు పెడుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారో చాలా మందికి అవగాహన ఉండదు. వాస్తవానికి వీటి వెనుక సాంప్రదాయంతో పాటు శాస్త్రీయత కూడా ఉన్నది.
చనిపోయిన వ్యక్తిని పాడెపై తీసుకుని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అతని శవం నోట్లో బియ్యం పోస్తారు. తర్వాత పన్నీరు చల్లుతారు. తులసి తీర్థం పోస్తారు. ఎందుకంటే తులసి తీర్థాన్ని సంజీవని అంటారు. దీని వల్ల చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికే చాన్స్ ఉందని నమ్ముతారు. ఇక డప్పుల శబ్ధం ఎందుకు చేస్తారంటే.. చనిపోయిన వ్యక్తిలో డప్పు శబ్ధానికి కదలికలు వచ్చే చాన్స్ ఉంటుందట. అందుకే డప్పులు కొట్టుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక కుండకు రంద్రాలు చేసి ఎందుకు తిప్పుతారంటే.. జీవితం కూడా ఇలా చిల్లులు పడిన కుండే అని చెప్పడానికి.దీని వెనుక శాస్త్రీయత కూడా ఉంది.
Funerals : దైవంతో సమానం అంటూ..
శ్మశాన వాటికలో చెట్లు, పొదలు ఎక్కువగా ఉంటాయి. శవాన్ని దహనం చేసినప్పుడు ఆ మంటలు వాటిని వ్యాపించకుండా ఈ నీరు ఆపుతుందట. ఇక చివరకు శవాన్ని దహనం చేయడం లేదా, పూడ్చడం చేసే ముందుక సైతం పాడె చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకంటే.. చనిపోయిన వారిని దేవుడితో సమానంగా చూస్తారు కాబట్టి పాడె చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాలతో శవం పాదాలు సైతం కడిగి కళ్లకు అద్దుకుంటారు. చనిపోకముందు వ్యక్తి ఎంతటి నీచుడు అయినా చనిపోయిన తర్వాత అతడు దైవంతో సమానం అని నమ్ముతారు.