Morning Tiffin | ఉదయం టిఫిన్ చేయడం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం లేవగానే శరీరానికి ఇంధనాన్ని అందించేందుకు ఆరోగ్యకరమైన అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది
1. టిఫిన్ మానితే డయాబెటిస్ ప్రమాదం
ఉదయం టిఫిన్ మానేసేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చూపుతున్నాయి. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండటం వలన శరీరానికి తక్షణ శక్తి అందదు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది.

#image_title
2. బరువు తగ్గాలన్న ఉద్దేశంతో టిఫిన్ మానితే మరింత బరువు పెరగొచ్చు
కొంత మంది బరువు తగ్గే ఉద్దేశంతో ఉదయం అల్పాహారం మానేస్తుంటారు. కానీ దీని ప్రభావం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. టిఫిన్ మానడం వలన ఆకలి ఎక్కువగా పెరిగి, రోజు మొత్తం ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది.
3. జీర్ణక్రియ మందగిస్తుంది
ఉదయపు అల్పాహారం శరీర జీర్ణక్రియను సక్రియంగా ఉంచుతుంది. దీన్ని దాటవేయడం వలన జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. ఫలితంగా కేలరీలు సరైన రీతిలో బర్న్ కావు, శరీరంలో అలసట, నిద్రాహత్తి, ఉద్రేకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
4. మానసిక ఆరోగ్యంపై ప్రభావం
ఉదయం టిఫిన్ మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. ఇది చిరాకు, ఒత్తిడి, ఫోకస్ లోపం వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు అల్పాహారం తీసుకోకపోతే చదువుపై దృష్టి సరిగా పెట్టలేరు. వారి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేరు.