Tholi Ekadasi : తొలి ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉండి ఈ మంత్రం చదివిన వారికి పట్టిందల్లా బంగారం…!
ప్రధానాంశాలు:
Tholi Ekadasi : తొలి ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉండి ఈ మంత్రం చదివిన వారికి పట్టిందల్లా బంగారం...!
Tholi Ekadasi : జులై 17వ తేదీన తొలి ఏకాదశి రోజున జరిగేటటువంటి ఏకాదశి వ్రత పూజను చేసుకున్న వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఒకవేళ పెళ్లి సంబంధాలు కుదరక ఉన్నవారికి త్వరగా పెళ్లి సంబంధాలు వస్తాయి. వివాహమై 15 సంవత్సరాలు అయిన పిల్లలు పుట్టని వారికి సంతానయోగం ఉంటుంది. అలాగే పిల్లలకు విద్యార్థుల విషయాలలొ చదువుపై శ్రద్ధ క్రమశిక్షణ , ఉద్యోగంలో నిలకడ లేకపోవడం ఖర్చులు ఎక్కువ కావడం నరగోషం ఉండడం. సమస్య ఏదైనా పరిష్కార మార్గం ఒకటే లక్ష్మీనారాయణ తొలి ఏకాదశి పూజ చేసుకున్నప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా లభిస్తాయి.
తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ విధానం ఎలా చేసుకోవాలి అంటే సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేవాలి. ఇల్లు తుడుచుకొని బయట ఉడిచి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి. తర్వాత పూజగదిని శుభ్రంగా తుడుచుకొని అంతకుముందు పెట్టినటువంటి పూలు పండ్లు తీసేసి స్వామి వారి విగ్రహాలను పూజా సామాన్లను శుభ్రపరచుకోవాలి. తర్వాత తలంటు స్నానం చేయాలి ఉతికిన వస్త్రాలను ధరించండి. జుట్టుని ముడి వేసుకొని దేవుడి దగ్గరికి వెళ్లి ఒక పీఠపైన తెల్లటి వస్త్రం పరిచి కొన్ని బియ్యాన్ని దానిమీద వేయాలి అందులో తమలపాకులు పెట్టి పసుపుతో తయారు చేసిన వినాయకుడిని పెట్టాలి. తరువాత కలసానికి దారం చుట్టేసి పసుపు కొమ్ముని కలసానికి కట్టండి.
కలశం లోపట బియ్యం గాని తమలపాకులు గాని వేసి మామిడాకులను ఆ కలశం చుట్టూ కట్టాలి. ఒక కొబ్బరికాయని కలశం మీద పెట్టి ఒక ఆకుపచ్చటి జాకెట్ ముక్కని పెట్టి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. శ్రీమహావిష్ణువు పడుకున్న ఫోటోని పెట్టుకొని కలశం లోకి స్వామివారిని ఆహ్వానించాలి. తర్వాత దేవుడికి అగరవతీయులతో దీపారాధన చేసి హారతి ఇవ్వండి. అలాగే సాష్టాత్క నమస్కారం చేసి మీరు ఉన్నచోటనే ప్రదక్షిణలు చేయండి. చివరిలో చేయవలసిన అతి ముఖ్యమైన పని ” యఫలం ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వర యఫలం ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వరన్ నారాయణ ” దేవుడికి కానుకను సమర్పించాలి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో నిండిపోతుంది.