Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజున ఈ నియమాలు పాటించండి.. ఆ పనులు అస్సలు చేయోద్దు..!
ప్రధానాంశాలు:
Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజున ఈ నియమాలు పాటించండి.. ఆ పనులు అస్సలు చేయోద్దు..!
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది మనం ఈ ఏకాదశిని జూలై 6, ఆదివారం నాడు జరుపుకుంటున్నాం. ఈ రోజుతో పాటు చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, ఈ రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు పాలకడలలో యోగ నిద్రలోకి వెళతారు. ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు.

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజున ఈ నియమాలు పాటించండి.. ఆ పనులు అస్సలు చేయోద్దు..!
Toli Ekadashi 2025 : ఆ పనులు అస్సలు చేయోద్దు
ఈ నాలుగు నెలల్లో భక్తులు తమకు ఇష్టమైన పదార్థాలను త్యజించి, భగవంతుని అనుగ్రహం కోసం ఉపవాసం, జపం, పూజ వంటి ఆచరణల్లో పాల్గొంటారు. “మనిషి త్యాగం చేస్తే, భగవంతుడు దానిని గుర్తించి అనుగ్రహిస్తాడు. అయితే పండితుల చెబుతున్న ప్రకారం, ఈ పవిత్ర దినంలో కొన్ని పనులను చేయకపోవడం వల్ల పుణ్యం కలుగుతుంది, అలాగే దరిద్రము నివారించబడుతుంది.
ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లపై మాత్రమే ఆధారపడాలి. మాంసాహారం, మద్యం తీసుకోకూడదు.కటింగ్, షేవింగ్ చేయరాదు , గోర్లు కత్తిరించకూడదు , తులసి దళాలను వాడకూడదు. చీపుర్లు బయటపడేయకూడదు, పగటి పూట నిద్ర మంచిది కాదు , ఒకరిని నిందించరాదు, గొడవలు చేయకూడదు , ఉపవాసం చేయడం కుదరకపోతే పాలు, పండ్లు తీసుకోవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణం, సత్యనారాయణ వ్రతం వంటి పూజలు చేయాలి. రోజు పొడవునా భగవంతుని ధ్యానిస్తూ, శాంతితో, భక్తితో గడపాలి. ఈ రోజున భక్తి భావంతో ఉపవాసం, జపం, ధ్యానం చేస్తే శరీరం, మనస్సు పవిత్రమవుతాయి. దోషాలు తొలగి, కష్టాలు కూడా తొలగిపోతాయని పండితుల అభిప్రాయం