Cholesterol : బాడీలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఈ పండ్లు తినాల్సిందే..!
Cholesterol : మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం. అయితే కొలెస్ట్రాల్ అనగానే అందరికీ చెడు కొలెస్ట్రాల్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ తో పాటు మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల బాడీలో మధుమేహం, గుండెపోటు, అధిక బీపీ లాంటివి వస్తుంటాయి. కానీ వాటిని దూరం చేసుకోవడానికి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి కొన్ని పండ్లను తినాల్సి ఉంటుంది. ఆ పండ్లను తింటేనే మనకు మంచి కొలెస్ట్రాల్ బాడీకి అందుతుంది.
Cholesterol : బెర్రీ పండ్లు
ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో లక్షణాలు వాపును తగ్గిస్తాయి. అంతే కాకుండా HDL స్థాయిలను పెంచేందుకు సాయం చేస్తుంటాయి.
Cholesterol : కీవీ పండు
కివీ పండు తిన్నా సరే మంచి కొలెస్ట్రాల్ బాగానే పెరుగుతుంది. ఇందులో ఉండే ప్రత్యేక లక్షణాలు గుండె జబ్బులను తగ్గించడంలో సాయం చేస్తుంటాయి. ఈ విషయం తాజా సర్వేలో తేలిపోయింది.
పుచ్చకాయ
పుచ్చకాయ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగానే పని చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈవెనింగ్ సమయంలో వీటిని తింటే మాత్రం కచ్చితంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
అవోకాడో పండు
అవోకాడో పండుతో గుండెకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని గనక తింటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు ఆటోమేటిక్ గా పెరుగుతుంటాయి.
నారింజ
నారింజను క్రమం తప్పకుండా తీసుకుంటే మాత్రం కచ్చితంగా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు ఆటోమేటిక్ గా పెరుగుతుంటాయి. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
బొప్పాయి
బొప్పాయి ఔషధాల గని అనే చెప్పుకోవాలి. ఇది బాడీలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగానే సాయం చేస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను బాగానే పెంచుతుంది.