భార్య కోసం ఎవరు చేయని పనిని చేసిన భర్త .. ఏం చేశాడో తెలిస్తే తలబాదుకుంటారు ..??

 Authored By aruna | The Telugu News | Updated on :2 July 2023,4:00 pm

పెళ్లి అంటే నూరేళ్లపంట అని అంటారు. కానీ ఇటీవల కాలంలో పెళ్ళైన సంవత్సరానికే దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకునేదాకా వెళుతున్నారు. ఈ పవిత్ర బంధం గురించి తెలియక నిత్యం ఏదో ఒక సమస్య గొడవలు పెట్టుకొని క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో వారి జీవితాలను నాశనం చేసుకుంది కాక పిల్లల జీవితాలను కూడా పాడు చేస్తున్నారు. అయితే ఒక భర్త మాత్రం తన భార్య కోసం సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లాలోని కొండన్నగూడ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండన్న గ్రామానికి చెందిన కందనోళ్ళ రాజేష్ అదే గ్రామానికి చెందిన శ్వేతతో 15 సంవత్సరాల క్రింద వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా షాద్ నగర్లో రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు రావడంతో తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే శ్వేత గొడవ పెట్టుకొని ఓ రోజు పుట్టింటికి వెళ్ళింది. దీంతో రాజేష్ భార్య తిరిగి రావడం లేదన్న మనస్థాపంతో శుక్రవారం రాత్రి గుళికల మందు ప్యాకెట్ తెచ్చుకొని కొండన్నగూడ గ్రామ శివారులోని తన పొలానికి వెళ్ళాడు.

Today Rangareddy District Crime News

Today Rangareddy District Crime News

శ్వేత నీతో గొడవ పడిన ప్రతిసారి అర్ధరాత్రి వచ్చి నీతో మాట్లాడేవాడిని, కానీ ఈసారి మూడు రోజులుగా నువ్వు నాతో మాట్లాడకుండా నన్ను ఒంటరిని చేశావు. నేను ఒంటరిగా తిరుగుతున్నా, నువ్వు నాకు బాగా గుర్తుకు వస్తావు, నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, నువ్వు లేని జీవితం నాకు వ్యర్థం, నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి, నావల్ల నువ్వు ఎప్పుడు ఇబ్బందులు పడవద్దు, దయచేసి ఆమెపై ఎలాంటి కేసులు పెట్టకండి అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. తర్వాత పోలీసులు వచ్చి పోస్టుమార్టం నిమిత్తం రాజేష్ ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి