Toothache : పంటినొప్పి తీవ్రంగా వేధిస్తోందా? ఈ వంటింటి చిట్కాలతో పంటినొప్పిని తగ్గించుకోండిలా..!
Toothache : పంటినొప్పి.. ప్రస్తుతం చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పంటి నొప్పి వల్ల ఏం తినలేకపోతారు. ఏదైనా కొరికినా.. తీవ్రంగా పంటి నొప్పి వస్తుంది. పంటినొప్పి ఉన్నవాళ్లు చాలా అసౌకర్యానికి గురవుతారు. ఎక్కడికీ వెళ్లలేరు. ఏ పనీ సరిగ్గా చేయలేరు. పంటి నొప్పితో పాటు.. చిగుళ్ల మీద వాపు కూడా వస్తుంటుంది కొందరికి. అస్తమానం పంటి నొప్పి వేధిస్తే మాత్రం ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిందే.
అయితే.. కొన్ని చిట్కాలు పాటిస్తే.. అసలు డెంటిస్టుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అవును.. మీరు చదివేది నిజమే. మన వంటింట్లోనే అన్ని రకాల చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలు పాటించి.. పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Toothache : ఈ చిట్కాలు పాటిస్తే.. పంటి నొప్పి పరార్ అవ్వాల్సిందే?
సాధారణంగా కొందరికి పళ్ల మధ్య గ్యాప్ రావడం వల్ల.. పంటి నొప్పి వస్తుంటుంది. అలాగే.. పళ్ల గ్యాప్ మధ్య ఆహారం ఇరుక్కుపోవడం వల్ల కూడా పంటి సమస్యలు వస్తుంటాయి. అటువంటప్పుడు.. పళ్ల మధ్యలో ఇరుక్కొని ఉన్న ఆహారాన్ని బయటికి లాగేయాలంటే.. ఉప్పు నీటితో మౌత్ వాష్ చేయాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా చేస్తే.. ఇన్ ప్లమేషన్ కూడా తగ్గిపోతుంది. దాని వల్ల.. నోట్లో ఉన్న చిన్న చిన్న పుండ్లు కూడా తగ్గిపోతాయి.
అలాగే.. హైడ్రోజన్ పెరాక్సైడ్ రిన్స్ ను ఉపయోగించి కూడా.. పంటి నొప్పిని తగ్గించవచ్చు. పళ్ల మీద ఉన్న బ్యాక్టీరియాను చంపేసి.. ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అయితే.. దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. 3 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్ ను మాత్రమే తీసుకొని.. దాన్ని నీటిలో వేసి.. మౌత్ వాష్ లా ఉపయోగించాలి. దీన్ని అస్సలు మింగకూడదు.
పంటి నొప్పికి మరో బెస్ట్ మందు కోల్డ్ కంప్రెస్. కోల్డ్ కంప్రెస్ ను తీసుకొని.. పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దాలి. అలా చేస్తే అక్కడ రక్త నాళాలు దగ్గరికి చేరుకొని పంటినొప్పి తగ్గుతుంది. చిగుళ్లలో వాపు ఉన్నా.. ఇన్ ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది. కోల్డ్ కంప్రెస్ చేయడం అంటే.. ఐస్ ముక్కలు వేసిన బ్యాగ్ ను పంటి వద్ద ఉంచడమే.
పెప్పర్ మింట్ టీ బ్యాగ్స్ కూడా పంటి నొప్పిని తగ్గిస్తాయి. మీ ఇంట్లో వెల్లుల్లి ఉంటే.. వెల్లుల్లి రెబ్బను తీసుకొని.. దాన్ని పేస్ట్ చేసి.. పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దాలి. అలా చేస్తే వెంటనే పంటినొప్పి తగ్గుతుంది. వెల్లుల్లి పేస్ట్ కు కాసింత ఉప్పు యాడ్ చేసినా కూడా పంటి నొప్పి తగ్గుతుంది. అలా కుదరకపోతే.. వెల్లుల్లి రెబ్బను తీసుకొని.. దాన్ని మెత్తగా నమలాలి. అలా చేసినా కూడా పంటినొప్పి వెంటనే తగ్గుతుంది.
వంటింట్లో లవంగాల నూనె ఉన్నా.. ఆ నూనెతో కూడా పంటి నొప్పిని తగ్గించవచ్చు. ఆ నూనెను పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో రుద్దాలి. లేదంటే.. ఒక గ్లాస్ లో కొన్ని నీళ్లను తీసుకొని.. దాంట్లో కాసింత లవంగా నూనె వేసి.. మౌత్ వాష్ కూడా చేయొచ్చు. జామ ఆకులను నమిలినా.. కొద్దిగా వాటిని దంచి.. నీటిలో వేసి మౌత్ వాష్ చేసినా కూడా పంటి నొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చదవండి ==> రోజురోజుకూ పెరుగుతున్న షుగర్ వ్యాధి.. అసలు షుగర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?
ఇది కూడా చదవండి ==> హై బీపి ఉన్నవారు ఉప్పుకు బదులు ఇవి వాడండి.. ?
ఇది కూడా చదవండి ==> బీపీ చెక్ చేసుకునే ముందు ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి..!
ఇది కూడా చదవండి ==> పెరుగు అంటే అస్సలు పడదా..? అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..!