Thummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల కీలక భేటీ.. మాజీమంత్రి పార్టీ వీడబోతున్నారా ?
Thummala Nageswara Rao : టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఏకం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యనేతలు ఇటీవల సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా నాయకుడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇతర అంశాలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.అయితే పార్టీలో తమకు జరిగిన అన్యాయం, ప్రాధాన్యత తగ్గించి జూనియర్లకు ప్రాధాన్యతనివ్వడం పై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళా టీఆర్ఎస్ నుంచి పార్టీ టికెట్ వచ్చే అవకాశాలు లేకపోతే ఏం చేయాలనేదానిపై కూడా మాట్లాడినట్లు సమాచారం.
దీంతో ఇద్దరు సీనియర్లు, పార్టీ అసంతృప్తులు భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో టీఆర్ెస్‌ను వీడేందుకు సిద్దమవుతున్నారనే చర్చ జరుగుతోంది.అయితే తుమ్మల అనుచరులు పాలేరు నియోజకవర్గంలోని నేతలు కూడా రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రుల భేటి తర్వాత ఈ నేతలు మీటవ్వడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీ నుంచైనా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా తుమ్మల వెంటే ఉంటామని పాలేరు నియోజకవర్గంలోని నేతల తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇతర పార్టీలనుంచి టీఆర్ెస్‌లోకి వచ్చిన నేతలు తమను టార్గెట్ చేస్తున్నట్లు.. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకుళ్లడానికే భేటి అయ్యామని చెబుతున్నట్లు సమాచారం.
Thummala Nageshwar Rao : రహస్య భేటీ..
అయితే ఈ భేటీకి మాజీమంత్రి సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావు దూరంగా ఉన్నారు.తాజాగా యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో.. తెలంగాణలోని టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్తి నేతలు బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని.. తుమ్మల కూడ అదే బాటలో పయనించే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నట్టుగా భావిస్తున్న నేతలంతా ఏకతాటిపైకి వచ్చి త్వరలోనే రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15 తర్వాత రాజకీయాల్లో భారీ పరిణామాలు జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ ఖమ్మం నేతలు అంటున్నారు.